‘భరత్ అనే నేను’తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది భామ కియారా అద్వాని. తొలి చిత్రంతోనే ఘనవిజయాన్ని చవిచూసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై ‘వినయ విధేయ రామ’లోనూ నాయికగా సందడి చేసింది. ఈ రెండు చిత్రాల్లోనూ అగ్ర కథానాయకులతోనే జట్టుకట్టింది కియారా. ‘భరత్ అనే నేను’లో సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ, ‘వినయ విధేయ రామ’లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తోనూ ఆడిపాడింది. తదనంతరం బాలీవుడ్ పైనే దృష్టిపెట్టిన ఈ సొగసరి త్వరలో మరో తెలుగు చిత్రంలో నటించబోతోందని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈసారి కూడా స్టార్ హీరోతోనే చిందులేయనుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘మహానటి’ ఫేమ్ నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ – వరల్డ్ మూవీగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే కథానాయిక పాత్ర కోసం దీపికా పదుకొణే, కత్రినా కైఫ్ వంటి ప్రముఖ బాలీవుడ్ కథానాయికల పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ భారీ బడ్జెట్ మూవీలో నటించే అవకాశం కియారాకు దక్కిందని వినికిడి. త్వరలోనే ‘ప్రభాస్ 21’లో కియారా ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, 2021 ఫిబ్రవరి నుంచి ప్రభాస్, నాగ్‌అశ్విన్ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































