2016 సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ పొంగల్ విన్నర్‌గా నిలవడమే కాకుండా.. ‘కింగ్’ నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సోషియో ఫాంటసీ మూవీకి సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది. ‘బంగార్రాజు’ పేరుతో తెరకెక్కనున్న ఈ కొనసాగింపు చిత్రంలో నాగ్‌తో పాటు ఆయన తనయుడు యువ సామ్రాట్ నాగచైతన్య కూడా నటించబోతున్నాడు. ‘సోగ్గాడే..’ని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణనే ఈ సీక్వెల్‌ని కూడా తీర్చిదిద్దనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, లాక్ డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. అంతేకాదు.. సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోందని టాక్. అలాగే, అన్నీ కుదిరితే 2020 క్రిస్మస్ కానుకగా లేదంటే 2021 సంక్రాంతి స్పెషల్‌గా ‘బంగార్రాజు’ని రిలీజ్ చేసే అవకాశముందంటున్నారు.




మరి, ‘సోగ్గాడే..’ లాగే ‘బంగార్రాజు’ కూడా బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























