వచ్చే సంక్రాంతి లేదా రిపబ్లిక్ డేకి ‘వకీల్ సాబ్’!

Pawan Kalyan Come Back Movie Vakeel Saab To Hit Theatres Either On These Two Days
Pawan Kalyan Come Back Movie Vakeel Saab To Hit Theatres Either On These Two Days

పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగానే షూటింగ్ ను జరుపుకుంది. అయితే కరోనా వల్ల శరవేగంగా జరుపుకుంటున్న షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాను మే 15న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ… అది కూడా వాయిదా పడనుంది. లాక్ డౌన్ కనుక తీస్తే మిగిలిన షూటింగ్ ను కూడా తొందరలో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఒకవేళ ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా రిలీజ్ మాత్రం అప్పుడే లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. లాక్ డౌన్ తీసేసినా థియేటర్స్ మాత్రం ఇప్పుడప్పుడే ఓపెన్ అయ్యే అవకాశం లేదు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా నవంబర్ వరకూ థియేటర్స్ తెరిచే అవకాశం ఉండకపోవచ్చు అని కూడా తెలిపారు. సో.. ‘వకీల్ సాబ్’  షూటింగ్ పూర్తయినప్పటికీ, నిర్మాత ‘దిల్’ రాజు ఇప్పట్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచన చేయడం లేదట. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వచ్చే ఏడాది.. సంక్రాంతికి లేదా ఈ సినిమాను విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఒకవేళ పెద్ద సినిమాలు ఏమైనా వుంటే, రిపబ్లిక్ డే కు రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నాడట. అదే కనుక నిజమైతే పవన్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే. చూద్దాం దీనిపై అధికారిక ప్రకటన ఇస్తాడేమో దిల్ రాజు..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్, థీం సాంగ్‌ను రిలీజ్ చేయగా వాటికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =