‘ఆచార్య’లో సిస్టర్ సెంటిమెంట్?

Actress Niharika Konidela To Play Pivotal Role In Acharya

‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి ఘనవిజయాల తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’ తరువాత చిరుకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా.. మెగా ప్రిన్సెస్ నిహారికా కొణిదెల అతిథి పాత్రలో దర్శనమివ్వనుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ‘ఆచార్య’లో సామాజిక సందేశంతో పాటు సిస్టర్ సెంటిమెంట్‌కి కూడా స్కోప్ ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఈ సన్నివేశాల్లో చరణ్, నిహారిక మధ్య సాగే సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ హార్ట్ ట‌చింగ్‌గా ఉంటాయని ఇన్‌సైడ్ టాక్. అంతేకాదు ఈ సినిమాతో నిహారికకి నటిగా మంచి గుర్తింపు రావడం ఖాయమంటున్నారు.

మరి, ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియాలంటే ‘ఆచార్య’ విడుదల వరకు వేచిచూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 5 =