ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైరెక్టోరియ‌ల్ ‘జాని’కి 17 ఏళ్ళు

Power Star Pawan Kalyan Directorial Johnny Completes 17 Years

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టినా.. అన‌తికాలంలోనే తనకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు ప‌వ‌న్. హీరోగా కెరీర్ ఆరంభంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్.. అదే జోరులో మెగాఫోన్ పట్టి దర్శకుడిగానూ అలరించే ప్రయత్నం చేశాడు. ఆ ప్ర‌య‌త్నానికి తెర‌రూప‌మే.. ‘జాని’. ‘బ‌ద్రి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత పవన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్ జంటగా నటించిన ఈ ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామాలో గీత, రఘువరన్, అలీ, బ్రహ్మాజీ, ఎం.ఎస్.నారాయణ, మల్లికార్జునరావు, రాజామురాద్‌ ముఖ్య భూమికలు పోషించారు. ‘జాని’కి ప‌వ‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌డ‌మే కాకుండా.. క‌థ‌, క‌థ‌నం కూడా స‌మ‌కూర్చ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్, మాస్ట‌ర్జీ సాహిత్యం సమకూర్చగా రమణ గోగుల విన‌సొంపైన బాణీలు అందించాడు. “ఏ చోట నువ్వున్నా”, “ఈ రేయి తీయనిది”, “నాలో నువ్వొక సగమై”, “నారాజు కాకురా”.. వంటి పాటలు శ్రోతలను అలరించాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అర‌వింద్‌ నిర్మించిన ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. దర్శకుడిగా పవన్‌లోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. 2003 ఏప్రిల్ 25న రిలీజైన ‘జాని’.. నేటితో 17 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − three =