మీరే మా నిజమైన ‘సూపర్ హీరోస్’..!

Super Star Mahesh Babu Urges Everyone To Be Kindful and Courteous Towards Medical Workers
Super Star Mahesh Babu Urges Everyone To Be Kindful and Courteous Towards Medical Workers

కరోనాతో పోరాడుతున్న మన కోసం… రాత్రింబవళ్లు ఎలాంటి అలుపు లేకుండా మన కోసం పనిచేస్తున్నారు డాక్టర్స్, పోలీసులు, నర్సులు మరియు పారిశుధ్య కార్మికులు. ఇక ఇప్పటికే వారి చేసే సేవలకు గాను అందరు వారి కృతజ్ఞతలు తెలుపుతుండగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడాదీనిపై స్పందించారు. ఈ కష్ట కాలంలో వారిపై ప్రేమ, సానుభూతి చూపించడమే వారికి మనం ఇచ్చే గొప్ప బహుమతి. ఈ పోరాటవీరుల పట్ల మర్యాదపూర్వకంగా, దయతో మెలగాలని అందరినీ అభ్యర్థిస్తున్నా. వారికి గౌరవం ఇవ్వండి. అవిరామంగా పనిచేస్తున్న వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలందరూ ఇంటివద్దనే ఉంటూ సురక్షితంగా ఉండండి’అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశాడు. ఇప్పటికే కరోనా సమయంలో పోలీసు, పారిశుద్య కార్మికుల సేవలను కొనియాడుతూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు తన తర్వాత సినిమాను పరుశురాంతో చేస్తున్నాడు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31 న ఈ సినిమా లాంచింగ్ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.