పవన్ 29 సినిమా డైరెక్టర్ కన్ఫామ్..?

PSPK 29 Movie Director Confirmed?
రాజకీయాలతో బిజీ గా ఉన్న పవన్ అసలు సినిమాలు చేస్తాడా? లేదా? అని అనుకుంటుండగా… ఆ అనుమానాలన్నింటికీ చెక్ పెడ్తూ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ కొట్టిన పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ సినిమాను చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. పరిస్థితులు బావున్నట్టయితే.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ నెల  15న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆ పరిస్థితి లేకుండా పోయింది. లాక్ డౌన్ తీసేసినా ఈ ఏడాది ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు.
ఇక వీటితో పాటు క్రిష్ తో మరో సినిమాను చేస్తున్నాడు పవన్. పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. క్రిష్ తర్వాత హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. ఇక ఈ రెండు సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో… ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పడం కష్టమే.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. పవన్ క్రిష్, హరీష్ శంకర్ సినిమాలే ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు కానీ.. అప్పుడే పవన్ 29వ సినిమా గురించి వార్తలు అందుకున్నాయి. పవన్ 29వ సినిమాకు డైరెక్టర్ గా కిశోర్‌కుమార్‌ పార్దసాని (డాలీ), డైరెక్టర్ బాబి పేర్లు విపిస్తున్నాయి. డాలీ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టాడట. మరి అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమా వచ్చాయి.
[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =