మహేష్, ప్రభాస్ లకు మథర్ క్యారెక్టర్ అయినా చేస్తా..!

Badri Heroine Renu Desai Ready To Play Mother Roles For Tollywood Top Stars
Badri Heroine Renu Desai Ready To Play Mother Roles For Tollywood Top Stars

బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే మంచి హిట్ తో పాటు తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ తోనే జానీ సినిమా చేయడం.. దాని తర్వాత పవన్ ప్రేమ, పెళ్లి చేసుకోవడం ఇలా ఫాస్ట్ గా జరిగిపోవడంతో రేణు దేశాయ్ కు పెద్దగా సినిమా చేసే అవకాశాలు రాలేదు. పవన్ నుండి విడిపోయిన తర్వాత కూడా డైరెక్టర్ గా మారి సినిమా చేసింది కానీ మళ్ళీ నటన వైపు వెళ్ళలేదు. ముఖానికి మేకప్ వేసుకోలేదు. అయితే ఇప్పుడు తనకు అవకాశం వస్తే కనుక నటిస్తానని తానే చెప్తుంది. అది కూడా తల్లి పాత్ర అయినా పర్వాలేదట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా ఎఫెక్ట్‌తో సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన సంగతి తెలిసిందే కదా. సోషల్ డిస్టెన్స్ లో వున్నా కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఇంట్లోనే ఉంటూ అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా అభిమానులతో ముచ్చటించిన రేణు దేశాయ్‌ని ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న అడిగారు. అదేంటంటే మ‌హేష్‌, ప్ర‌భాస్ వంటి వారికి త‌ల్లిగా న‌టించే అవ‌కాశం వ‌స్తే చేస్తారా? అని. దానికి రేణు దేశాయ్ స‌ద‌రు హీరోల చిన్న త‌నంలోని పాత్ర‌ల‌కు తల్లి పాత్ర చేయ‌డానికి సిద్ధ‌మేన‌ని స‌మాధానం ఇచ్చారు. అంతేకాదు.. తనను ఓల్డ్ లుక్‌లో బాగా చూపింగ‌ల‌రు అనే న‌మ్మ‌కం ఉంటే మ‌హేష్‌, ప్రభాస్, బన్నీ లాంటి హీరోల‌కు త‌ల్లిగా న‌టిచేందుకు సిద్ధ‌మేన‌ని రేణు తెలిపారు. మేమంతా ఆర్టిస్టులం.. ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు రెడీగా ఉండాలి అని రేణూ దేశాయ్ అన్నారు.

మరి మొత్తానికి రేణు మళ్లీ నటిస్తానని మాత్రం చెప్పేసింది. మరి డైరెక్టర్స్ తనకు తగిన విధంగా కథలు రావడమే లేట్. చూద్దాం మరి ఎవరైనా అంత ధైర్యం చేస్తారేమో…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.