సోషల్ మీడియాలోకి అడుగుపెట్టినప్పటినుండి మెగాస్టార్ చిరు ఎంత యాక్టీవ్ గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక పక్క కరోనాకు సంబంధించిన సలహాలు సూచనలు చెబుతూనే మరోపక్క పలు ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తూనే వున్నారు. మొన్నటికి మొన్న తన మానవరాలితో ఆడుకుంటూ ఉన్న వీడియోను పోస్ట్ చేసిన చిరు తాజాగా చెర్రీపై కామెడీ చేస్తూ ట్వీట్ చేసాడు. రామ్ చరణ్ తన తల్లి సురేఖ, నానమ్మ అంజనా దేవితో కలిసి నిన్న వెన్న తీయడం ఎలాగో నేర్చికుంటూ.. ఆ వీడియో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు చెర్రీని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మై డియర్ బచ్చా… మా అమ్మ దగ్గర నీ ‘బటర్’ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడూ నాదే. నీవు ఎంతగా బుజ్జగించి నీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించినా ఆమె వద్ద నువ్వు నా కన్నా బెటర్ కాలేవు. కానీ, అదే గ్యారంటీ నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో’ అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీ పోస్ట్ చేశారు. మరి దీనికి చెర్రీ ఇంకేదైనా కౌంటర్ గా రిప్లై ఇస్తాడా లేదా చూద్దాం..!
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మై డియర్ బచ్చా …మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. How much ever you BUTTER, your position will not become BETTER. But … …అదే guarantee నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో 😜 https://t.co/x1AIBZR3lM
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 2, 2020
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: