తెలుగు సినిమా గ్లామర్‌కు సరికొత్త గ్రామర్ నేర్పిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. అన్ని జానర్లలోనూ విజయాలు అందుకున్న ఘనత ఈ దర్శకేంద్రుడిది. అలాంటి రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘బాబు’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శోభన్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో వాణిశ్రీ, లక్ష్మి నాయికలుగా నటించారు. అరుణా యిరాని (హిందీ నటి), కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, రాజబాబు, మిక్కిలినేని, ముక్కామల, గోకిన రామారావు, జి.వరలక్ష్మి ముఖ్య భూమికలు పోషించగా.. గుమ్మడి, మురళీమోహన్, శ్రీధర్ అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు తండ్రి, ప్రముఖ దర్శకనిర్మాత కె.యస్.ప్రకాశరావు కథను అందించగా ఆచార్య ఆత్రేయ సంభాషణలు సమకూర్చారు.



ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన పాటలకు చక్రవర్తి బాణీలు సమకూర్చారు. “ఒక జంట కలిసిన తరుణాన”, “అయ్యబాబోయ్ అదిరిపోయింది”, “ఎన్నెన్ని ఒంపులు ఎన్నెన్ని సొంపులు”, “తరతరాల ఈ వంశగౌరవం”, “బొంబాయి అమ్మాయి”, “నా స్నేహం పండి ప్రేమై నిండిన”, “ఓయమ్మా ఎంతలేసి సిగ్గొచ్చింది”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకాదరణ పొందింది. ఏ.వి.యం.సీజర్ సమర్పణలో మారుతీ ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.యల్.కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1975 మే 2న విడుదలైన ‘బాబు’.. నేటితో 45 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: