పీరియాడిక‌ల్ డ్రామాగా ఎన్టీఆర్ 31 మూవీ.. విలన్ గా రణవీర్ సింగ్..?

Junior NTR To Team Up With Bollywood Director Sanjay Leela Bhansali and Ranveer Singh For NTR 31
Junior NTR To Team Up With Bollywood Director Sanjay Leela Bhansali and Ranveer Singh For NTR 31

స్టార్ హీరో సినిమా అంటే రూమర్స్ రావడం కామన్ థింగ్. ఏం చేసిన వాటిని ఆపడం కష్టం. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పై కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటే బయటకు వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. గత రెండేళ్లుగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుపుకుంటూనే ఉంది. దాదాపు చివరి దశకు రాగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా తీస్తారు అని తెగ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలన్నిటికీ బ్రేక్ వేస్తూ ఎన్టీఆర్ తర్వాత సినిమా త్రివిక్రమ్ తోనే అని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై “ఎన్టీఆర్ 30” మూవీ రూపొందనుంది. ఇక ఈ మూవీ లో యంగ్ &స్టైలిష్ బిజినెస్ మెన్ గా ఎన్టీఆర్ కనిపిస్తారని సమాచారం. ఇంతకు ముందు నటించని పాత్రలో ఎన్టీఆర్ ను పరిచయం చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశాడట.

ఇక ఇదిలా ఉండగా ఎన్టీఆర్ 30 నే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే ఎన్టీఆర్31 పై ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే.. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత సంజయ్‌లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌కత్వంలో ఓ భారీ చారిత్రాత్మ‌క చిత్రం తెర‌కెక్క‌నుందట. ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటిస్తార‌ని టాక్‌. అంతేకాదు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కూడా ఇందులో నటిస్తున్నారట. అది కూడా విల‌న్‌గా నటిస్తున్నారని అంటున్నారు. మరి ఇది కొంచం నమ్మేలా అనిపించకపోయినా.. ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. అందులో సినీ ఇండస్ట్రీ లో. వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా వచ్చినా ఆశ్ఛర్యపోనవసరంలేదు. చూద్దాం మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 3 =