వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న ఈతరం దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకరు. అతని దర్శకత్వంలో తెరకెక్కిన ‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’, ‘మహర్షి’ వంటి సినిమాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన సినిమాలతో అలరిస్తూ వస్తున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. విమర్శకుల ప్రశంసలనూ అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. సరిగ్గా 13 ఏళ్ళ క్రితం ఇదే రోజున అంటే 2007 మే 2న ‘మున్నా’తో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు వంశీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, కళ్యాణి, సుకన్య, సుధ, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. గ్లామర్ క్వీన్ శ్రియా శరణ్ ప్రత్యేక గీతంలో మెరిసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమాకి హారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చారు. వాటిలో “మనసా నువ్వుండే చోటే” పాట అప్పట్లో ఓ సంచలనం. తొలి సినిమాతోనే దర్శకుడిగా ఆకట్టుకున్న వంశీ పైడిపల్లి.. నేటితో 13 ఏళ్ళ తన దర్శక ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నాడు.



కాగా.. టాలీవుడ్ స్టార్ హీరోలతో (ప్రభాస్, యన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగార్జున, మహేష్ బాబు) వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలు చేసిన ఈ టాలెంటెడ్ టెక్నీషియన్.. ఫ్యూచర్లో మరిన్ని డిఫరెంట్ మూవీస్‌తో ఆడియన్స్‌ను అలరించాలని.. కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























