దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “KGF చాప్టర్ 1” కన్నడ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో హారో యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. “KGF చాప్టర్ 1” మూవీ సీక్వెల్ గా రూపొందుతున్న “KGF చాప్టర్ 2” మూవీ అక్టోబర్ లో రిలీజ్ కానుందని సమాచారం. హీరో యశ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ “మఫ్తి ” మూవీ ఫేమ్ నార్తన్ దర్శకత్వంలో యశ్ హీరోగా ఒక కన్నడ మూవీ రూపొందనుంది. ఈ మూవీలో హీరోయిన్ గా తమన్నా ను సంప్రదించినట్టు, తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కన్నడ భాషతో పాటు పలు భాషలలో ఈ మూవీ రిలీజ్ కానుంది. “KGF చాప్టర్ 1” కన్నడ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించిన తమన్నా ఇప్పుడు యశ్ కు జోడీగా నటించడం విశేషం. తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































