అజిత్ కు విలన్ గా.. కార్తికేయ హింట్ ఇచ్చాడా..!

Actor Kartikeya Gives Secret Hint About His New Movie With Thala Ajith ?
Actor Kartikeya Gives Secret Hint About His New Movie With Thala Ajith ?

`ఆర్ ఎక్స్ 100` తో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తికేయ మొదటి సినిమాతోనే సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయాడు. గత ఏడాది ఏకంగా నాలుగు చిత్రాలు హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడ‌ర్, 90 ML తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే అవి ఆశించినంత విజయం అందించలేక పోయాయి. వీటిలో `గ్యాంగ్ లీడ‌ర్`లో పోషించిన విల‌న్ రోల్ కు మాత్రం మంచి పేరొచ్చింది. హీరోగానే కాదు విలన్ గా కూడా తాను నటించగలని చూపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా… అజిత్ సినిమాలో విలన్ పాత్రలో కార్తికేయ చేయనున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో నిజం లేదని… అవి కేవలం రూమర్స్ మాత్రమే అని కూడా అన్నారు. అయితే తాజాగా కార్తికేయ చేసిన ఒక చర్య వల్ల ఈ సినిమాలో కార్తికేయ ఉన్నాడన్న వాదన బలంగా వినిపిస్తుంది. అదేంటంటే అజిత్ పుట్టిన రోజున ఆయనకి కార్తికేయ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంతో, ఆయన ‘వాలిమై’ చేయడం ఖాయమైపోయిందనే టాక్ బలాన్ని పుంజుకుంది. మరి చూడబోతే ఈ వార్తలో కొంత నిజం ఉందనే అనిపిస్తుంది. చూద్దాం మరి కార్తికేయ ఏమంటాడో..

 

కాగా హెచ్ వినోత్ దర్శకత్వంలో అజిత్ ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే చాల వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక కార్తికేయ తెలుగులో ‘చావుకబురు చల్లగా’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై వున్న సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =