కుటుంబకథా చిత్రం ‘ఆహ్వానం’కు 23 ఏళ్ళు

SV Krishna Reddy Wholesome Family Entertainer Aahwanam Completes 23 Years.

“దేవతలారా రండి.. మీ దీవెనలందించండి.. నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి..
కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడ‌నిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి.. కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి..” అంటూ పాట రూపంలో తనకు కాబోయే భ‌ర్త ఎలా ఉండాలో చెప్పే అమ్మాయికి అలాంటి భర్త వ‌చ్చాక.. అనూహ్య ప‌రిణామాలు ఎదురైతే.. వాటిని ఆమె ఏ విధంగా ఎదుర్కొంది? అన్నదే ‘ఆహ్వానం’ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీకాంత్, రమ్యకృష్ణ జంటగా నటించిన ఈ ఫ్యామిలీ డ్రామాని ఎస్.వి.కృష్ణారెడ్డి తెర‌కెక్కించారు. హీరా, కైకాల సత్యనారాయణ, గిరిబాబు, ‘సాక్షి’ రంగారావు, చలపతిరావు, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్, తనికెళ్ళ భరణి, అలీ, శివాజీరాజా, శివపార్వతి, నిర్మలమ్మ, అన్నపూర్ణ, “డబ్బింగ్” జానకి, వై.విజయ, శ్రీలక్ష్మి, ఝాన్సీ ముఖ్య పాత్రలు పోషించారు.

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర గీతరచనకు ఎస్.వి.కృష్ణారెడ్డి వీనులవిందైన బాణీలు అందించారు. “దేవతలారా రండి”, “పందిరి వేసిన ఆకాశానికి”, “మిన్సారే మిన్సారే”, “మనసా.. నా మనసా”, “ఆకాశం పందిరి వేసింది”, “హాయ్ హాయ్ మేనకా”, “లక్ష్మీ కళ్యాణ వైభోగమే”, “ఏలాలో ఏలాలో”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకాదరణ పొందింది. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రం.. స్పెషల్ జ్యూరీ(ఎస్.వి.కృష్ణారెడ్డి) కేట‌గిరీలో ‘నంది’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. 1997 మే 2న విడుదలై ప్రేక్షకులను అలరించిన ‘ఆహ్వానం’.. నేటితో 23 వసంతాలను పూర్తి చేసుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + nineteen =