కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 100

సినిమా వార్తలు

రష్మిక అనూహ్య నిర్ణయం ?

"ఛలో ", "గీత గోవిందం ", సరిలేరు నీకెవ్వరు", "భీష్మ " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక లక్కీ హీరోయిన్ గా పేరుపొందారు. తెలుగు తో పాటు కన్నడ , తమిళ భాష చిత్రాల ఆఫర్స్ అందుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లేడీ అమితాబ్ విజయశాంతి కి మహేష్ బర్త్ డే శుభాకాంక్షలు

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయ శాంతి ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. అత్యధిక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి విజయ శాంతి రికార్డ్ క్రియేట్ చేశారు . 3 దశాబ్దాల సినీ కెరీర్ లో 180 మూవీస్ కు పైగా నటించి, ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ హోదాను విజయశాంతి దక్కించుకున్నారు. హీరోలతో పోటీపడి రెమ్యునరేషన్ అందుకున్న విజయశాంతి "నాయుడమ్మ "మూవీ (2006 ) తరువాత సినిమాలకు దూరం అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి పల్లెటూరి యువతి పాత్రలో సాయి పల్లవి

బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ " మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి సూపర్ హిట్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఫిదా " మూవీ లో పల్లెటూరి యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. "మిడిల్ క్లాస్ అబ్బాయి ", "కణం", "పడి పడి లేచె మనసు " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ మూవీస్ లో కూడా నటించిన సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాటపర్వం" మూవీస్ లో నటిస్తున్నారు. సాయి పల్లవి ఇప్పుడు మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Hiranya Kashyapa Movie Team Releases An Interesting Update
సినిమా వార్తలు

"హిరణ్య కశ్యప"మూవీ అప్ డేట్

సక్సెస్ ఫుల్ "లీడర్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రానా దగ్గుబాటి తెలుగు, తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. రానా హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన "అరణ్య" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రానా ప్రస్తుతం 3 తమిళ మూవీస్ , "విరాట పర్వం" తెలుగు మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

న్యూ లుక్ లో సీనియర్ హీరోయిన్ రాశి

దక్షిణాది భాషల తో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో సుమారు 3 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న రాశి కొంత కాలం గ్యాప్ తరువాత ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొన్ని నెలలుగా షూటింగ్స్ లో పాల్గొనని సీనియర్ హీరోయిన్ రాశి తన లుక్ ను మొత్తం మార్చేసుకుని స్లిమ్ గా మారారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ కు "నో "- నిత్యామీనన్

దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిత్యామీనన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఆలా మొదలైంది ", గుండె జారి గల్లంతయ్యిందే ", "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు " మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. నిత్యామీనన్ తొలి వెబ్ సిరీస్ "బ్రీత్ సీజన్ 2 " త్వరలోనే ప్రసారం కానుంది. పలు భాషాచిత్రాలలో నటిస్తున్న నిత్యామీనన్ లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయ్యి కథలు రాస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆనందం లో రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు , తమిళ , హిందీ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కరోనా లాక్ డౌన్ సమయంలో ముంబై లో ఇంటికి పరిమితం అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉన్నారు. దాదాపు 3నెలల తరువాత గురుగావ్ లోని తన స్వంత ఇంటికి రకుల్ చేరుకున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులతో టైమ్ స్పెండ్ చేస్తున్న రకుల్ ఆనందం ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రజలకు లావణ్య త్రిపాఠి సందేశం

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలపై తన ప్రభావం చూపుతుంది. ప్రపంచం లో సుమారు 93 లక్షల కరోనా కేసులు, సుమారు 4లక్షల 76 వేల మరణాలు సంభవించాయి. భారత దేశంలో 4 లక్షల 40 వేల కేసులు , 14 వేల మరణాలు సంభవించాయి. భారత దేశంలో కరోనా మహమ్మారి మరింత వేగంగా విజృంభిస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి కరోనా తో ప్రజలకు బోర్ కొట్టిందేమో కానీ కరోనా కు బోర్ కొట్టలేదు , జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సమంత కొత్త సినిమాలు

టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సమంత ఇప్పుడు 48రోజుల ఆశా క్రియ అనే మెడిటేషన్ ను ప్రాక్టీస్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో కొత్త ఫొటో

బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం " మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారారు. "సరిలేరు నీకెవ్వరు", "భీష్మ" వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెడిటేషన్ లో సమంత

తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. సమంత ఇప్పుడు మానసిక ప్రశాంతతకు మెడిటేషన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'హిరణ్య కశిప' ఆగేది లేదు..!

రానా దగ్గబాటి, గుణశేఖర్ కాంబినేషన్ లో “హిరణ్య కశిప” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. వాటికి చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తూనే ఉంది. ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని గతంలోనే సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. అయినా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమాపై వస్తున్న రూమర్ ఈ సినిమా ఆగిపోయిందని. ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలం అవుతుంది. అయినా ఇది సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈనేపథ్యంలో మూవీ ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి అంతగా బాలేదు. మరోపక్క థియేటర్స్ కూడా ఓపెన్ చేసే పరిస్థితి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శృతి హాసన్ హాలీవుడ్ ఎంట్రీ ?

తెలుగు , తమిళ, హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ఇప్పుడు హాలీవుడ్ లో ఎంటర్ కానున్నారని సమాచారం. దర్శకుడు రామిన్ బహ్రానీ అంతర్జాతీయ వెబ్ సిరీస్ "ట్రెడ్ స్టోన్ " ను తెరకెక్కించనున్నారు. ఢిల్లీ లోని ఒక హోటల్ లో వెయిట్రెస్ గా పని చేస్తూ హత్యలు చేసే యువతిగా శృతి ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'జనగణమన' నా డ్రీమ్ ప్రాజెక్ట్..!

పూరీ 'జనగణమన' సినిమా గురించి గత కొన్నాళ్లుగా వింటూనే ఉన్నాం. గతంలో మహేష్ తో అనుకున్నాడు కానీ అది కుదరలేదు. ఇక ఆ తర్వాత పలు సినిమాలు తీశాడు కానీ వరుస పరాజయాలే అందుకున్నాడు. ఇక గత ఏడాది ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పూరీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ తో ఫైటర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కృష్ణ అండ్ హిజ్ లీల' మీరు అనుకున్నదానికంటే ముందే వస్తుంది..!

క్షణం డైరెక్టర్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్న‌లగ‌డ్డ, జెర్సీ ఫేమ్ శ్రద్దాశ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ పరిస్థితి తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగులు జరుపుకోడానికి అనుమతులు ఇస్తుండటంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో పెండింగ్ లో పనులను పూర్తి చేసుకుంటున్నారు అందరూ. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పనులు కూడా మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఈ ట్రైలర్ ను చిత్రయూనిట్ నిన్న విడుదల చేసింది. లవ్ అండ్ రొమాంటిక్ సీన్లతో పాటు సస్పెన్స్ తో కూడుకున్న ఈ ట్రైలర్ సినిమాపై…

TFN Adminవాట్సాప్
Stylish Star Allu Arjun Family Action Entertainer Duvvada Jagannadham Completes 3 Years.
సినిమా వార్తలు

3సంవత్సరాల "దువ్వాడ జగన్నాథం "

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ "దువ్వాడ జగన్నాథం" 2017 సంవత్సరం జూన్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రోజు తో "దువ్వాడ జగన్నాథం" మూవీ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కొన్ని ఫొటోస్ ను రిలీజ్ చేసింది. వాటిలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కీర్తి సురేష్ మ్యూజికల్ విషెస్

తమిళ సూపర్ స్టార్ , తలపతి విజయ్ బర్త్ డే జూన్ 22 సందర్భంగా సినీ ప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లు వెత్తాయి. తెలుగు , తమిళ , మలయాళ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ , విజయ్ కు వెరైటీ గా బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డజనుకు పైగా సినిమాలు - లాక్ డౌన్ లో తీరిక లేకుండా బిజీగా థమన్

'అల వైకుంఠపురములో' లాంటి ఆడియో ఆల్బమ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను 'అల వైకుంఠపురములో' సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రెకార్డ్ సాధిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం థమన్ ఒకటి కాదు రెండు కాదు డజను సినిమాలతో సూపర్ బిజీ గా వున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'పెంగ్విన్' పై రష్మిక స్పందన - ప్రతి తల్లికి ఈ సినిమా రిలేట్ అవుతుంది..!

ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా పెంగ్విన్. ఇక ఈ సినిమాను ఈనెల 19న డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. సైకో థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ముఖ్యంగా కీర్తి సురేష్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. తన బిడ్డను కాపాడుకోడానికి కీర్తి చేసే ప్రయత్నాలు.. అసలు నిజం తెలుసుకోడానికి తాను ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొనే విధానం.. ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నీ కోణాల్లో కీర్తి నటనే ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుందో అని దర్శకుడు చాలా చక్కగా చూపించాడన్న ప్రశంసలూ దక్కుతున్నాయి.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

విశాల్ 'చక్ర' గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ రిలీజ్

గత మూడు నెలలుగా షూటింగ్స్ కు లేక ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వని దర్శకనిర్మాతలు.. ఇప్పుడు చిన్న చిన్నగా షూటింగ్ లు మొదలు పెడుతుండటంతో అప్ డేట్స్ కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే విశాల్ చక్ర సినిమా తెలుగు పోస్ట‌ర్‌ను ఈరోజు ఉదయం విడుద‌ల చేసిన చిత్ర యూనిట్‌ ఇప్పుడు తాజాగా `చ‌క్ర` గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ పేరుతో వీడియో విడుద‌ల చేసింది.

TFN Adminవాట్సాప్

షేర్