లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయ శాంతి ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. అత్యధిక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి విజయ శాంతి రికార్డ్ క్రియేట్ చేశారు . 3 దశాబ్దాల సినీ కెరీర్ లో 180 మూవీస్ కు పైగా నటించి, ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ హోదాను విజయశాంతి దక్కించుకున్నారు. హీరోలతో పోటీపడి రెమ్యునరేషన్ అందుకున్న విజయశాంతి “నాయుడమ్మ “మూవీ (2006 ) తరువాత సినిమాలకు దూరం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు. “హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు, ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యం, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ” అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. విజయ శాంతి తో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ తో 14 సంవత్సరాల తరువాత విజయశాంతి టాలీవుడ్ కు రీ ఎంట్రీ కావడం విశేషం. “సరిలేరు నీకెవ్వరు ” మూవీ లో విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: