విశాల్ ‘చక్ర’ గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ రిలీజ్

Vishal Latest Movie Chakra Glimpse Of Trailer Is Out

గత మూడు నెలలుగా షూటింగ్స్ కు లేక ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వని దర్శకనిర్మాతలు.. ఇప్పుడు చిన్న చిన్నగా షూటింగ్ లు మొదలు పెడుతుండటంతో అప్ డేట్స్ కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే విశాల్ చక్ర సినిమా తెలుగు పోస్ట‌ర్‌ను ఈరోజు ఉదయం విడుద‌ల చేసిన చిత్ర యూనిట్‌ ఇప్పుడు తాజాగా `చ‌క్ర` గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ పేరుతో వీడియో విడుద‌ల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


కాగా ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన అభిమన్యుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇంకా వారం రోజులు షూటింగ్ మాత్రమే మిగులుంది. ‌ఇక షూటింగ్ లు మొదలవుతున్నాయి కాబట్టి అది కూడా పూర్తి చేసి తొందరలోనే రిలీజ్ చేసే ప్లాన్ చేయాలని చూస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ స్వయంగా నిర్మిస్తుండగా శ్రద్దా శ్రీనాధ్, రెజీనా కాసాండ్రా, శ్రుతీ డాంగే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా రోబో శంకర్‌, కేఆర్‌ విజయ, మనోబాలా, విజయబాబు తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =