
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 101

రూమర్స్ పై నయన్, విఘ్నేష్ ఫన్నీ రిప్లై..!
మొదలైన 'సూపర్ మచ్చి' ఆఖరి షెడ్యూల్..!
శృతి హాసన్ మిడ్ నైట్ మేకప్ ప్రయోగం
రెడీ గా ఉన్నా.. వారి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న..!
"మాస్టర్" మూవీ స్పెషల్ పోస్టర్
హీరో కృష్ణ కు మహేష్ బాబు ఫాదర్స్ డే శుభాకాంక్షలు
నాని హీరోయిన్ కోసం పెద్ద లిస్ట్..!
యోగా స్టూడెంట్ ప్రభాస్
యోగ టిప్స్ చెపుతున్న రెబల్ స్టార్..!
పెళ్ళికి ముందే సినిమా పూర్తి..!
రానా వివాహానికి వేదిక ఖరారు..!
కింగ్ నాగార్జున కు జోడీగా ఇలియానా ?
రేణు దేశాయ్ రీ ఎంట్రీ
ఆమె బయోపిక్ లో నటించాలని ఉంది..!

"చెఫ్ పూజా "

అభిమానులే నా ఆక్సిజన్..!
లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సమయంలో సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా తన అభిమానులతో సరదాగా మాట్లాడిన నిఖిల్ పలు ఆసక్తికరవిషయాలు తెలిపాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘అభిమానుల గురించి ఒక్కమాట చెప్పండి? ‘ అని అడగగా. ‘నా ఆక్సిజన్ నా అభిమానులు... సక్సెస్ లో ఉన్నా.. లేకపోయినా నాకు ఎప్పుడూ అండగా ఉంటూనే ఉన్నారు.. వారికి నా ధన్యవాదాలు’ అని తెలిపాడు. ఇక వాటితో పాటు మరిన్ని ప్రశ్నలు అడిగారు. అలాగే మరో అభిమాని ‘మీ మిత్రుడు ఎవరు?’ అని అడగగా ‘దర్శకుడు చందూ మొండేటి‘ అని చెప్పారు. మీకు ఇష్టమైన వెబ్ సిరీస్? అని అడగగా…
రూమర్స్ పై నయన్, విఘ్నేష్ ఫన్నీ రిప్లై..!
నయన్ సినిమా కెరీర్ గురించి అయితే ఎలాంటి ఢోకా లేదు. లేడీ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకుంది. అయితే వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఏదో ఇక వార్త, ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇక తాజాగా వచ్చిన రూమర్ నయన్ కు కరోనా అన్న వార్తలు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంది. ఇక ఇప్పుడు సడలింపులు కూడా చేయడంతో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి.
మొదలైన 'సూపర్ మచ్చి' ఆఖరి షెడ్యూల్..!
విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. అయితే మొదటి సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ.. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు దేవ్. టీవీ సీరియళ్ల దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'సూపర్ మచ్చి' అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా.. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్ తో వస్తుంది.
ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసిన 'ఇస్మార్ట్ భామ'...?
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కన్నడ భామ నభా నటేష్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్ర మరింత పేరును సంపాదించి పెట్టడమే కాదు ఇప్పుడు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. నభా ప్రస్తుతం "సోలో బ్రతుకే సో బెటర్ ", అల్లుడు అదుర్స్" మూవీస్ లో నటిస్తుంది. ఇంకా నితిన్ హీరోగా వస్తున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ లో కూడా నభా ను తీసుకోనున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు వింటూనే వున్నాం.
శృతి హాసన్ మిడ్ నైట్ మేకప్ ప్రయోగం
కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికే పరిమితం అయిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తూ అభిమాను లను అలరిస్తున్నారు. తన పెట్ క్యాట్ క్లారా తో ఆడుకుంటూ , పాటలు పాడుతూ , పియానో ప్లే చేస్తూ , కొత్త వంటకాలు ప్రిపేర్ చేస్తూ, సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ శృతి టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
"లూసిఫర్" తెలుగు రీమేక్ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ ?
ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సుహాసిని దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. "స్వాతి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన సుహాసిని బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. "సింధు భైరవి " తమిళ మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సుహాసిని ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
విశాల్ 'చక్ర' తెలుగు పోస్టర్ రిలీజ్..!
ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన అభిమన్యుడు చిత్రానికి సీక్వెల్ గా అన్నట్టు తెలుస్తుంది. ఇంకా వారం రోజులు షూటింగ్ మాత్రమే మిగులుందని ఇప్పటికే విశాల్ చెప్పాడు. ఇక షూటింగ్ లు మొదలవుతున్నాయి కాబట్టి అది కూడా పూర్తి చేసి తొందరలోనే రిలీజ్ చేసే ప్లాన్ చేయాలని చూస్తున్నారు.
రెడీ గా ఉన్నా.. వారి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న..!
లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు, సినిమా రిలీజ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో చిన్నగా షూటింగ్ లు మొదలుపెట్టాలని చూస్తున్నారు. మరోవైపు రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్పుడే షూటింగ్ లకు వెళ్ళకూడదని కూడా ఆలోచిస్తున్నారు. అందరూ ఆగష్ట్ నుండే షూటింగ్ లకు వెళ్లాలని చూస్తున్నారు.
"మాస్టర్" మూవీ స్పెషల్ పోస్టర్
తమిళ సూపర్ స్టార్ , తలపతి విజయ్ బర్త్ డే సందర్భంగా కాజల్ అగర్వాల్ , విశాల్ , శివకార్తికేయన్, హరీష్ కళ్యాణ్, విఘ్నేష్ శివన్ , అట్లీ , లోకేష్ కనగరాజ్, అనిరుధ్ రవిచందర్ , మాళవిక మోహనన్ వంటి సినీ ప్రముఖులతో పాటు అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. అధిక సంఖ్య లో ఉన్న విజయ్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో విజయ్ బర్త్ డే ను ఘనంగా జరుపుకుంటున్నారు.
హీరో కృష్ణ కు మహేష్ బాబు ఫాదర్స్ డే శుభాకాంక్షలు
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫాదర్ హీరో కృష్ణ కు ఫాదర్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ తరువాత మహేష్ బాబు , సూపర్ హిట్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
నాని హీరోయిన్ కోసం పెద్ద లిస్ట్..!
గత ఏడాది గ్యాంగ్ లీడర్ సినిమా తో వచ్చిన నాని ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. పరిస్థితులు బాగుండి ఉంటే ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు మరో సినిమా కూడా రిలీజ్ సిద్ధంగా ఉండేది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని హీరో గా నటించిన 'వి' సినిమా ఉగాది పండుగ రోజు మార్చి 25 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ లు వాయిదా పడ్డాయి. ఆ సినిమానే ఇప్పటి వరకూ నోచుకోలేదు.
యోగా స్టూడెంట్ ప్రభాస్
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా లో కొన్ని ఫొటోస్ తో పాటు ఒక వీడియో ను రిలీజ్ చేశారు. తాను యోగా స్టూడెంట్ నని , తన యోగా అనుభవాలను అభిమానులకు షేర్ చేశారు. యోగా తో ఎంతో రిలీఫ్ గా ఉంటుందని , ఫిట్ గా ఉంటామని , యోగా తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రభాస్ తెలిపారు.
హాలీవుడ్ నుండి ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు..!
అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అచ్చ తెలుగు భామ ఈషా రెబ్బా.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ రెండూ ఉన్నా తెరపై పద్దతిగా కనిపిస్తుండటంతో అవేవీ అంతగా కలసిరావడం లేదు. ''అమీతుమీ, అ!, అరవింద సమేత'' లాంటి సినిమాల్లో నటించిన ఆమె ఈ మధ్యే సత్యదేవ్ హీరోగా వచ్చిన 'రాగల 24 గంటల్లో' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో కూడా లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో కియారా అద్వాని చేసిన పాత్రలో ఈషా రెబ్బా నటిస్తుంది.
యోగ టిప్స్ చెపుతున్న రెబల్ స్టార్..!
రేపు ప్రపంచ యోగా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే కదా. జూన్ 21న ప్రపంచమంతా 6వ అంతర్జాతీయ యోగా డే సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. నిజానికి ప్రతి ఏడు బహిరంగ ప్రదేశాల్లో యోగ డే సెలెబ్రేట్ చేసేవాళ్ళు. అయితే కరోనా వైరస్ కారణంగా ఈసారి బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో యోగా దినోత్సవం జరుపుకోవడం సాధ్యం కాదు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో ఎక్కడివారక్కడే యోగా డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పెళ్ళికి ముందే సినిమా పూర్తి..!
మొత్తానికి నిహారిక కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. నిన్ననే తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసింది. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిహారిక చేసుకోబోయే చైతన్య అయితే ఒక్కరోజులో ఫేమస్ అయిపోయాడు. అంతేకాదు హీరోకి కాబోయే అన్ని లక్షణాలు ఉన్నాయంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు అందరూ.
రానా వివాహానికి వేదిక ఖరారు..!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన రానా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. డిసెంబర్ లో పెళ్లి అనుకున్నారు.. కానీ ఆగష్ట్ 8 వ తేదీన పెళ్లి డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో రానా - మిహీకా ల పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయట. ముందు వీరి పెళ్లి రామానాయుడు స్టూడియోస్ లో చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఇరు కుటుంబసభ్యులు మాట్లాడుకొని ఫైనల్ మరో వేదికను నిర్ణయించుకున్నారట.
కింగ్ నాగార్జున కు జోడీగా ఇలియానా ?
కింగ్ నాగార్జున ప్రస్తుతం నూతన దర్శకుడు సోలోమెన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున ఇప్పుడు రెండు సినిమాలను లైన్ లో పెట్టారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ "సోగ్గాడే చిన్ని నాయనా " మూవీ సీక్వెల్ "బంగార్రాజు", మరొకటి సక్సెస్ ఫుల్ "గరుడవేగ" మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందే మూవీ. అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ "రైడ్ " బాలీవుడ్ మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందనుంది. "రైడ్ " బాలీవుడ్ మూవీ లో హీరోయిన్ గా నటించిన ఇలియానా ను తెలుగు వెర్షన్ కు కూడా ఎంపిక చేయాలని ప్లాన్ చేసి ఆమె తో సంప్రదింపులు జరుపుతున్నట్టు…
రేణు దేశాయ్ రీ ఎంట్రీ
యాక్ట్రెస్ , ఎడిటర్ , కాస్ట్యూమ్స్ డిజైనర్ , ప్రొడ్యూసర్, డైరెక్టర్ రేణు దేశాయ్ "బద్రి ", "జానీ "," జేమ్స్ పాండు " (తమిళ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "ఇష్క్ వాలా లవ్ "మరాఠీ మూవీ దర్శకత్వం వహించి , నిర్మించారు. మోస్ట్ ట్యాలెంటెడ్ రేణు దేశాయ్ తెలుగు మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తానని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 18 సంవత్సరాల తరువాత నటించాలనే నిర్ణయం రేణు తీసుకున్నారు.
ఆమె బయోపిక్ లో నటించాలని ఉంది..!
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. ఇక ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట చేసింది.

"చెఫ్ పూజా "
పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "Prabhas 20", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్న పూజాహెగ్డే మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూజాహెగ్డే నటించిన బాలీవుడ్ మూవీ "హౌస్ ఫుల్ 4"ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.