ప్రజలకు లావణ్య త్రిపాఠి సందేశం

Tollywood Actress Lavanya Tripathi Urges Everyone Not To Forget Wearing Masks To Stay Protected From Corona Virus

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలపై తన ప్రభావం చూపుతుంది. ప్రపంచం లో సుమారు 93 లక్షల కరోనా కేసులు, సుమారు 4లక్షల 76 వేల మరణాలు సంభవించాయి. భారత దేశంలో 4 లక్షల 40 వేల కేసులు , 14 వేల మరణాలు సంభవించాయి. భారత దేశంలో కరోనా మహమ్మారి మరింత వేగంగా విజృంభిస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి కరోనా తో ప్రజలకు బోర్ కొట్టిందేమో కానీ కరోనా కు బోర్ కొట్టలేదు , జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ నిబంధనలు సవరించడంతో ప్రజలు విచ్చలవిడిగా రోడ్ల పై సంచరించడంతో మాస్క్ ధరించాల్సిన ఆవశ్యకత ను లావణ్య వివరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే మాస్క్ ధరించాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. డిజైనర్ అనితా రెడ్డి తో కలసి లావణ్య “రెడ్ ట్రీ “పేరుతో లాభాపేక్ష లేకుండా మాస్క్ లు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. లావణ్య మాట్లాడుతూ .. ప్రజల సేఫ్టీ కొరకు మాస్క్ లు తయారు చేసి అందుబాటు లో ఉంచుతున్నామని, డిఫరెంట్ సెక్టార్ లలో మాస్క్ లు డొనేట్ చేస్తున్నామని చెప్పారు. లావణ్య ప్రస్తుతం “A1 ఎక్స్ ప్రెస్ “, “చావు కబురు చల్లగా ” మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.