టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సమంత ఇప్పుడు 48రోజుల ఆశా క్రియ అనే మెడిటేషన్ ను ప్రాక్టీస్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రొమాంటిక్ డ్రామా “జాను” మూవీ తరువాత సమంత “ది ఫ్యామిలీ మెన్ 2” వెబ్ సిరీస్ లో నటించారు. “జాను” మూవీ షూటింగ్ టైమ్ లోనే ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం సమంత అనౌన్స్ చేశారు. సోనీ పిక్చర్స్ బ్యానర్ పై “గేమ్ ఓవర్ “మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు ,తమిళ భాషలలో ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. లాక్ డౌన్ కారణం గా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న ఒక మల్టీ స్టారర్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో నయనతార తోపాటు సమంత స్క్రీన్ షేర్ చేసుకుంటారు. సమంత ప్రస్తుతం ఈ రెండు మూవీస్ పై ఫోకస్ పెట్టారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: