పూరీ ‘జనగణమన’ సినిమా గురించి గత కొన్నాళ్లుగా వింటూనే ఉన్నాం. గతంలో మహేష్ తో అనుకున్నాడు కానీ అది కుదరలేదు. ఇక ఆ తర్వాత పలు సినిమాలు తీశాడు కానీ వరుస పరాజయాలే అందుకున్నాడు. ఇక గత ఏడాది ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పూరీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ తో ఫైటర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన అని తెలిపాడు. తొందరలోనే ఈ సినిమాను తీయడానికి ప్లాన్ చేస్తున్నా అని తెలిపాడు. అంతేకాదు పాన్ ఇండియా తరహాలోనే ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక గతంలో ఈ సినిమాను పవన్ తో చేయాలని పూరీ చూస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ ఉన్న మూడు సినిమాలు అయిపోయిన తర్వాత ‘జనగణమన’ కథను కూడా సెట్స్ పైకి తేవాలని ఆలోచిస్తున్నాడని అన్నారు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో.. మరి పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఎవరితో తీస్తాడో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























