‘పెంగ్విన్’ పై రష్మిక స్పందన – ప్రతి తల్లికి ఈ సినిమా రిలేట్ అవుతుంది..!

Rashmika Mandanna About Keerthy Suresh's Penguin Movie

ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా పెంగ్విన్. ఇక ఈ సినిమాను ఈనెల 19న డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. సైకో థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ముఖ్యంగా కీర్తి సురేష్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. తన బిడ్డను కాపాడుకోడానికి కీర్తి చేసే ప్రయత్నాలు.. అసలు నిజం తెలుసుకోడానికి తాను ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొనే విధానం.. ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నీ కోణాల్లో కీర్తి నటనే ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుందో అని దర్శకుడు చాలా చక్కగా చూపించాడన్న ప్రశంసలూ దక్కుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా చూసిన రష్మిక కూడా సినిమాపై ప్రశంసలు కురిపించింది. సినిమా చూసి తన అభిప్రాయాన్ని పంచుకుంది. నిన్న రాత్రే పెంగ్విన్ సినిమా చూశాను.. ఎప్పటిలాగే నువ్వు చాలా బాగా నటించావు కీర్తి.. ప్రతి తల్లికీ ఈ సినిమా రిలేట్ అవుతుంది.. నేను ఖచ్చితంగా చెప్పగలను.. ఈ డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్, ప్రొడ్యూసర్ కార్తీక్ సుబ్బరాజు ఇద్దరికీ కంగ్రాట్స్ అలాగే సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ డ్ బెస్ట్ అంటూ తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది.

ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. “సుల్తాన్ “తమిళ మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెడుతుంది. వీటితో పాటు కన్నడ మూవీస్ లో కూడా నటిస్తుంది ఈ భామ.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =