బ్లాక్ బస్టర్ “ఛలో” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక “గీత గోవిందం ” మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారారు. “సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సహజ సౌందర్యం తో అలలారుతున్న రష్మిక ఇప్పుడు మచ్చలేని మేకప్ తో ఉన్న తన ఫోటో ను, గర్ల్ బాస్ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకొనడానికి ట్రై చేస్తున్నారు అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. తెలుగు మూవీస్ తోపాటు కన్నడ మూవీస్ లో నటిస్తున్న రష్మిక “సుల్తాన్ ” మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప” మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన “పుష్ప” మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: