డజనుకు పైగా సినిమాలు – లాక్ డౌన్ లో తీరిక లేకుండా బిజీగా థమన్

Music Director Thaman Gets Busy With Handful Of New Movie Offers Amidst Lockdown

‘అల వైకుంఠపురములో’ లాంటి ఆడియో ఆల్బమ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను ‘అల వైకుంఠపురములో’ సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రెకార్డ్ సాధిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం థమన్ ఒకటి కాదు రెండు కాదు డజను సినిమాలతో సూపర్ బిజీ గా వున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ లాక్ డౌన్ టైంలో హీరో, హీరోయిన్స్ మిగతా కాస్ట్ కాస్త ఖాళీగా ఉన్నా…మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం తమ పనుల్లో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో థమన్ కూడా తన సినిమాలకు బిజీగా మ్యూజిక్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ‘వి’ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక వకీల్ సాబ్, సోలో బ్రతుకే సో బెటర్, క్రాక్ సినిమాలు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. వీటితో పాటు.. బాలకృష్ణ-బోయపాటి సినిమా, నాని టక్ జగదీష్, వరుణ్ తేజ సినిమాలకు రీ-రికార్డింగ్ పనుల్లో బిజీ గా వున్నాడు. ఇక సర్కారు వారి పాట, త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాకు కూడా థమనే మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా మ్యూజిక్ ను కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ లాక్ డౌన్ లో కూడా తీరిక లేకుండా పని చేస్తున్నాడట. అన్నీ అనుకున్న టైం లో.. అలానే బెస్ట్ మ్యూజిక్ ఇవ్వాలని చూస్తున్నాడట. మరి ఇన్ని సినిమాలు తీరిక లేకుండా చేయడం అంటే మాములు విషయం కాదు కదా.

మొత్తానికి కిక్ సినిమాతో తన ప్రయాణాన్నిమొదలు పెట్టిన తమన్ వరుస సినిమాలతో బిజీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ముందు ముందు కూడా థమన్ ఇలానే చేతినిండా సినిమాలతో బిజీగా ఉండాలని కోరుకుందాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =