మరోసారి పల్లెటూరి యువతి పాత్రలో సాయి పల్లవి

Actress Sai Pallavi Once Again Plays Village Girl In Her Upcoming Movie Shyam Singha Roy After Fidaa Movie

బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి సూపర్ హిట్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఫిదా ” మూవీ లో పల్లెటూరి యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. “మిడిల్ క్లాస్ అబ్బాయి “, “కణం”, “పడి పడి లేచె మనసు ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ మూవీస్ లో కూడా నటించిన సాయి పల్లవి ప్రస్తుతం “లవ్ స్టోరీ “, “విరాటపర్వం” మూవీస్ లో నటిస్తున్నారు. సాయి పల్లవి ఇప్పుడు మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ “టాక్సీ వాలా ” మూవీ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. “ఫిదా ” మూవీ లో పల్లెటూరి యువతి గా ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి మరోసారి పల్లెటూరి యువతి గా “శ్యామ్ సింగ రాయ్ ” మూవీతో అలరించనున్నారు. హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణదర్శకత్వంలో రూపొందుతున్న “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తరువాత “శ్యామ్ సింగ రాయ్ ” మూవీసెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + eighteen =