తమిళ సూపర్ స్టార్ , తలపతి విజయ్ బర్త్ డే జూన్ 22 సందర్భంగా సినీ ప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లు వెత్తాయి. తెలుగు , తమిళ , మలయాళ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ , విజయ్ కు వెరైటీ గా బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘Life is very short Nanba, always be happy!’
Happy Birthday @actorvijay Sir! 😊❤️
A small tribute to you on your birthday sir
❤️#HappyBirthdayThalapathyVijay #HBDTHALAPATHYVijay #Master pic.twitter.com/Xnxgidjuhr— Keerthy Suresh (@KeerthyOfficial) June 22, 2020
దళపతి విజయ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “మాస్టర్ ” తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాష లో కూడా రిలీజ్ కానున్న ఈ మూవీ లోని “కుట్టి స్టోరీ ” సాంగ్ ను వయోలిన్ ప్లే చేస్తున్న తన వీడియో ను కీర్తి ట్విట్టర్ లో షేర్ చేశారు. “జీవితం చాలా చిన్నది ఫ్రెండ్ , ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, హ్యాపీ బర్త్ డే విజయ్ సార్ , మీ బర్త్ డే సందర్భంగా ఒక చిన్న వీడియో”అంటూ కీర్తి ట్వీట్ చేశారు. కీర్తి వయోలిన్ ప్లే చేస్తున్న వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: