రానా దగ్గబాటి, గుణశేఖర్ కాంబినేషన్ లో “హిరణ్య కశిప” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. వాటికి చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తూనే ఉంది. ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని గతంలోనే సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. అయినా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమాపై వస్తున్న రూమర్ ఈ సినిమా ఆగిపోయిందని. ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలం అవుతుంది. అయినా ఇది సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈనేపథ్యంలో మూవీ ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి అంతగా బాలేదు. మరోపక్క థియేటర్స్ కూడా ఓపెన్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఆ బిజినెస్ కూడా జరగట్లేదు. అందుకే భారీ బడ్జెట్ సినిమాలు కాస్త వెనక్కి తగ్గి తమ బడ్జెట్ ను తగ్గించుకోడానికి రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాను ఆపాలని చూస్తున్నారన్న వార్తలు అందుకున్నాయి. అయితే ఇప్పుడు ఆవార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు చిత్రయూనిట్. ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తయ్యాయి.. ప్రస్తుతం రానా వేరే సినిమాలతో బిజీగాఉన్నాడు అవి అయిపోయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కిస్తారని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: