‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మీరు అనుకున్నదానికంటే ముందే వస్తుంది..!

Krishna And His Leela Movie Will Release A Head of Your Expectations Says Rana Daggubati

క్షణం డైరెక్టర్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్న‌లగ‌డ్డ, జెర్సీ ఫేమ్ శ్రద్దాశ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ పరిస్థితి తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగులు జరుపుకోడానికి అనుమతులు ఇస్తుండటంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో పెండింగ్ లో పనులను పూర్తి చేసుకుంటున్నారు అందరూ. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పనులు కూడా మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఈ ట్రైలర్ ను చిత్రయూనిట్ నిన్న విడుదల చేసింది. లవ్ అండ్ రొమాంటిక్ సీన్లతో పాటు సస్పెన్స్ తో కూడుకున్న ఈ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను కూడా ఓటీటీ ప్లాట్‌ ఫాం ద్వారా విడుదల చేయాలని చూస్తున్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు హింట్ లు ఇస్తున్నారు కానీ కన్ఫామ్ గా అయితే మాత్రం చెప్పట్లేదు. అంతేకాదు ఈ వార్తలపై రానా కూడా స్పందిస్తూ.. ఓకే రూమర్స్ వచ్చేసాయి.. త్వరలోనే ఈ సినిమా వస్తుంది.. మీరు అనుకున్నదానికంటే ముందే ఈ సినిమా రాబోతుంది అని చెప్పాడు. అయితే అది ఎప్పుడు, ఏ వేదికపై వస్తుందన్న విషయం మాత్రం చెప్పలేదు. చూడబోతే త్వరలోనే ఈ సినిమా కూడా ఓటీటీ లో దర్శనమిచ్చేలా ఉంది. చూద్దాం త్వరలోనే కన్ఫామ్ చేస్తారేమో.


కాగా దగ్గుబాటి రానా సమర్పిస్తుండగా..సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 కామ్ మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 5 =