ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 9
వెబ్ సిరీస్ లో హీరోయిన్ హెబ్బా పటేల్
సంక్రాంతి తరువాత `ప్రభాస్ 20` నెక్స్ట్ షెడ్యూల్?

సుశాంత్ కొత్త సినిమా ప్రకటన అప్ డేట్

'అసురన్' ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..!
రూలర్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒకే టైమ్ లో రెండు చిత్రాల షూటింగ్ తో నాగచైతన్య?
`ఎఫ్ 3` స్క్రిప్ట్ లాక్ చేసిన అనిల్ రావిపూడి?
కళ్యాణ్ రామ్ కి జోడీగా కేథరిన్?
రవితేజ తో నటించాలని ఉంది - సాయి ధరమ్ తేజ్
ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన "ప్రతి రోజూ పండగే " మూవీ పాజిటివ్ టాక్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. చిత్ర విజయం పట్ల సాయి ఆనందం వ్యక్తం చేశారు. మల్టీ స్టారర్ మూవీస్ పై తన స్పందన తెలియజేశారు.
వెబ్ సిరీస్ లో హీరోయిన్ హెబ్బా పటేల్
"అలా ఎలా "మూవీ తో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన హెబ్బా పటేల్ నటించిన "కుమారి 21F ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా " "అంధగాడు " మూవీస్ ఘనవిజయం సాధించాయి. హెబ్బా పటేల్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెబ్బా పటేల్ ప్రస్తుతం నితిన్ "భీష్మ ", రాజ్ తరుణ్ "ఒరేయ్ బుజ్జిగా " మూవీస్ లో నటిస్తున్నారు.
హీరో సుశాంత్ మూవీ టైటిల్ పోస్టర్ విడుదల
సక్సెస్ ఫుల్ మూవీ "కాళిదాసు " తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సుశాంత్ నటించిన "కరెంట్ ","చి || ల || సౌ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. సుశాంత్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "అల .. వైకుంఠపురములో .. మూవీ లో ఒక కీలక పాత్రలో నటించారు. ఆ మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది.
సంక్రాంతి తరువాత `ప్రభాస్ 20` నెక్స్ట్ షెడ్యూల్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ పిరియాడికల్ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. `జిల్` రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ జరుపుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ ని సంక్రాంతి తరువాత మొదలుపెడతారని తెలిసింది. ఆపై చకచకా చిత్రీకరణ జరిపి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా అక్టోబర్ 23న రిలీజ్ చేస్తారని సమాచారం. దసరా పండక్కి రెండు రోజుల ముందు ప్రభాస్ పుట్టినరోజు వస్తుండడంతో... అక్టోబర్ 23ని రిలీజ్ డేట్ గా లాక్…
రజినీ కోసం మరోమారు ఎస్పీబీ ఇంట్రో సాంగ్
ఈ ఏడాది సంక్రాంతికి `పేట`తో పలకరించిన సూపర్ స్టార్ రజినీ కాంత్... వచ్చే సంవత్సరం ముగ్గుల పండక్కి `దర్బార్`తో సందడి చేయనున్నారు. ఈ లోపే... తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించారాయన. `శౌర్యం` శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... బుధవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం డి. ఇమాన్ స్వరసారథ్యంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఇంట్రో సాంగ్ ని ... రజినీ బృందంపై చిత్రీకరిస్తున్నారని సమాచారం.
హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో నాగార్జున కాప్ స్టోరీ?
`మన్మథుడు 2` తరువాత స్వల్ప విరామం తీసుకున్న కింగ్ నాగార్జున... త్వరలో తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించబోతున్నారు. `ఊపిరి` రచయిత సాల్మన్ తెరకెక్కించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

'డిస్కో రాజా' నుండి 'ఢిల్లీ వాలా' పాట విడుదల
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్ థ్రిల్లర్ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్లో దర్శనమివ్వనున్నాడు. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. మొదటి పాట, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రూలర్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా బాలయ్య అభిమానులకు తప్పా మిగిలిన వాళ్లకు నచ్చడం కొంచెం కష్టమైన పనే..

ప్రతిరోజూ పండగే - తేజ్, మారుతి కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్..!
మారుతి దర్శకత్వంలో సాయి తేజ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లు గా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

సుశాంత్ కొత్త సినిమా ప్రకటన అప్ డేట్
వరుస పరాజయాల తర్వాత సుశాంత్ ఇటీవలే 'చి.ల.సౌ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో తన తర్వాత సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అల వైకుంఠపురములో సినిమా చేస్తూనే మరో వైపు హీరోగా చేసేందుకు కథలు వింటున్నాడు సుశాంత్.

'నిశ్శబ్దం'నుండి నిన్నే నిన్నే లిరికల్ సాంగ్ రిలీజ్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్ లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
ప్రతిరోజూ పండగే మూవీ రివ్యూ - కామెడీ ప్లస్ ఎమోషనల్
ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రతిరోజూ పండగే, రూలర్ లేటెస్ట్ కలెక్షన్స్
చిత్రలహరి సినిమాతో విజయాన్ని అందుకున్న సాయితేజ్ ఆ సక్సెస్ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకొని ఫైనల్ గా మారుతి తో ప్రతిరోజూ పండగే సినిమా చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు రిలీజయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ రోజు రిలీజ్ అయిన సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతో పాటు బాలకృష్ణ నటించిన రూలర్, సల్మాన్ ఖాన్ దబాంగ్3 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి ఈ రోజు రిలీజ్ ఐన ఈ సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

'అసురన్' ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..!
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో 'అసురన్' సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా గతకొద్ది కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ జనవరి 2 నుండి మొదలుకానుంది. రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రీకరణ మొదలుకానుంది.
రూలర్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
మహేష్ తో `తూ ఆజా మేరీ రాజా` అంటున్న తమన్నా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.
`ఛల్ మోహన్ రంగ` దర్శకుడితో నితిన్ `పవర్ పేట`?
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. `భీష్మ`, `రంగ్ దే`, `చదరంగం` (చంద్రశేఖర్ యేలేటి ఫిల్మ్) పేర్లతో రూపొందుతున్న సదరు మూడు సినిమాలు చిత్రీకరణ తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో... `ఛల్ మోహన్ రంగ` దర్శకుడు కృష్ణ చైతన్యతో కొత్త చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు నితిన్.
ఒకే టైమ్ లో రెండు చిత్రాల షూటింగ్ తో నాగచైతన్య?
ఈ ఏడాది `మజిలీ`, `వెంకి మామ` చిత్రాలతో విజయాలను అందుకున్న యువ సామ్రాట్ నాగచైతన్య... వచ్చే ఏడాది కూడా అదే జోష్ చూపించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న `లవ్ స్టోరీ` (ప్రచారంలో ఉన్న పేరు)లో నటిస్తున్న చైతూ... ఆ సినిమా విడుదలయ్యాక మరో రెండు సినిమాలను పట్టాలెక్కించనున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా సమాంతరంగా చిత్రీకరణ జరుపుకుంటాయని టాక్.
`ఎఫ్ 3` స్క్రిప్ట్ లాక్ చేసిన అనిల్ రావిపూడి?
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలచిన చిత్రం `ఎఫ్ 2`. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించారు. కాగా, 2019 సంక్రాంతి విజేతగా నిలచిన `ఎఫ్ 2`కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది.
కళ్యాణ్ రామ్ కి జోడీగా కేథరిన్?
నందమూరి హీరో కళ్యాణ్ రామ్... `రావణ` పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వేణు మల్లిడి దర్శకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రాన్ని యన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. 2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... అదే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.