ప్రతిరోజూ పండగే మూవీ రివ్యూ – కామెడీ ప్లస్ ఎమోషనల్

2019 Telugu Movies Reviews And Ratings, Latest telugu movie reviews, latest telugu movies news, Prati Roju Pandaage Movie Plus Points, Prati Roju Pandaage Movie Public Talk, Prati Roju Pandaage Movie Review, Prati Roju Pandaage Movie Story, Prati Roju Pandaage Review, Prati Roju Pandaage Review Annd Rating, Prati Roju Pandaage Telugu Movie Live Updates, Prati Roju Pandaage Telugu Movie Public Response, Prati Roju Pandaage Telugu Movie Review, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

చిత్రలహరి విజయం తర్వాత సాయి తేజ్ నటించిన సినిమా ప్రతి రోజూ పండగే. యూత్‌ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో కామెడీ కమ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా పై మొదటినుండీ మంచి అంచనాలే వున్నాయి. ఆ అంచనాల నేపథ్యంలోనే ఈ రోజు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎంత వరకూ ప్రేక్షకులకు నచ్చింది.. ఈ సినిమాతో మరోసారి సాయితేజ్ హిట్ సొంతం చేసుకున్నాడా..?లేదా? అన్నది తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే.

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, స‌త్య‌రాజ్‌, రావు ర‌మేష్‌, ర‌జిత‌, విజ‌య్‌కుమార్‌, అజ‌య్‌, ముర‌ళీశ‌ర్మ‌, ప్ర‌వీణ్‌, మ‌హేష్‌, శ్రీకాంత్ అయ్య‌ర్, భ‌ద్ర‌మ్, సుహాస్‌ తదితరులు
డైరెక్టర్: మారుతి
సంగీతం:థమన్
సినిమాటోగ్రఫీ: జయకుమార్

కథ:

రఘురామయ్య(సత్యరాజ్) కొడుకులు, కూతురు విదేశాల్లో స్థిరపడటంతో రాజమండ్రిలో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఈ క్రమంలో రఘు రామయ్యకు క్యాన్సర్ ఉందని.. కొద్దిరోజులు మాత్రమే బతుకుతావని డాక్టర్స్ చెపుతారు. అయినా కూడా కొడుకులు, కూతురు తమ తండ్రితో ఉండటానికి ఇష్టపడరు. అలాంటి సమయంలో ఆయన మనవడు సాయి (సాయి తేజ్)అమెరికా నుంచి వస్తాడు. తాత చావును కూడా పండగ చేయాలనుకుంటాడు. దూరమైపోయిన కొడుకులు కూతుళ్లను మళ్లీ అందరిని ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో కథ ఎలాంటి మలుపులు తిరిగింది..?వారిలో సాయి ఎలా మార్పును తీసుకొచ్చాడు? తండ్రి ప్రేమను రఘురామయ్య కొడుకులు ఎలా గుర్తించారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఇలాంటి స్టోరీ లైన్ తో గతంలో చాలా సినిమాలే చూసాం మనం. ఎంతో కష్టపడి కొడుకులను, కూతుర్లను చదివించి.. వారిని ఉన్నత స్థానంలో ఉంచితే.. డబ్బు వ్యామోహంలో పడిపోయి బంధాలను మరిచిపోయి..వారు మాత్రం కన్నతల్లీ తండ్రులను కూడా పట్టించుకోకుండా ఒంటరిగా వదిలిపెట్టి పిల్లలు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు మనం నిజ జీవితంలో కూడా చూస్తూనే ఉంటాం. అలాంటి లైన్ నే తీసుకొని మారుతి ఈ సినిమాను తెరకెక్కించాడు.

మారుతి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ ఎంటర్టైనర్ కు కేరాఫ్ అడ్రస్. అయితే ఈ సినిమాకు కాస్త తన రూట్ ను మార్చాడు. పూర్తిగా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందించే ప్రయత్నం చేసాడు. కామెడీతో పాటు సెంటిమెంట్‌ను పండిస్తూ సినిమాను నడిపించాడు. వయసు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను వదిలేసి.. తమ బతుకు తాము బతికేయాలనుకునే కొడుకులకు ఈ కథ కనువిప్పు కలిగించేలా రాసుకున్నాడు మారుతి.

ఇక హీరోగా సాయితేజ్ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో తన పాత్ర‌లో చాలా బాగా న‌టించాడు. మనవడిగా తన పాత్రకు న్యాయం చేసాడు. కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ కూడా బాగానే పండించాడు. తన విలక్షణ డైలాగ్ డెలివరీతో తాను కనిపించిన ప్రతి సన్నివేశం థియేటర్‌లో నవ్విస్తుంది.

తండ్రి కంటే డబ్బు, టైమ్‌కు ఎక్కువ విలువనిచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా రావురమేష్ మరోసారి తన పాత్రలో జీవించాడు. ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకోకుండా తన మనసులో ఉన్న మాటల్ని నిర్మొహమాటంగా చెప్పే మనస్తత్వమున్న వ్యక్తిగా అతడి పాత్ర ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

ఈ సినిమాకు మరో ముఖ్యమైన పాత్ర రఘురామ‌య్య. ఈ పాత్ర‌లో సత్యరాజ్ ప‌ర‌కాయం ప్ర‌వేశం చేస్తూ.. తన పాత్రకు తగ్గట్లుగానే మంచి ఎమోష‌నల్ టచ్ ఇచ్చాడు. కొడుకులు, కూతురును ప్రాణంగా ప్రేమించి తండ్రిగా రఘురామయ్య పాత్రలో తన అనుభవాన్ని అంత ఉపయోగిస్తూ నటించారు సత్యరాజ్. అంతేకాదు సాయితేజ్, సత్యరాజ్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి.

అన్నింటికంటే హైలైట్ రాశి ఖన్నా ఏంజిల్ ఆర్నా ట్రాక్. సుప్రీమ్ సినిమాలో అదిరిపోయే కామెడీ చేసిన రాశి.. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలో రెచ్చిపోయింది. కమెడియన్స్ అవసరం లేకుండా పూర్తిగా రాశిపైనే కామెడీ చేయించాడు మారుతి. రావు రమేష్, రాశీ ఖన్నా మధ్య కామెడీ బాగా పండింది. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేకుండా ఇద్దరూ సినిమా అంతా బాగానే నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు హ‌రితేజ‌, ప్ర‌వీణ్‌, అజ‌య్‌, స‌త్యం రాజేష్‌ అలాగే ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు

సాంకేతిక విభాగానికి వస్తే థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు.

ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here