‘అసురన్’ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..!

Asuran Movie Remake Gets A Launch Date, Asuran Movie Remake Reelease Date Fixed, Asuran Movie Remake Release Date Confirmed, Asuran Movie Remake Release Date Locked, Latest News On Asuran Movie Remake Release Date, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘అసురన్’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా గతకొద్ది కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ జనవరి 2 నుండి మొదలుకానుంది. రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రీకరణ మొదలుకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అసురన్ తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కథానాయిక, ఇతర ప్రధాన పాత్రల కోసం నటీనటుల్ని ఎంపిక చేసే పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలను తెలియజేయనున్నారు.

మరి తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. మరి తెలుగులో ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + seven =