సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఫక్తు కమర్షియల్ మూవీగా తెరకెక్కిన `సరిలేరు నీకెవ్వరు`లో రెండు ప్రత్యేక గీతాలుంటాయని సమాచారం. అందులో ఒకటి `మైండ్ బ్లాక్` కాగా… మరొకటి `ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై… తూ ఆజా మేరీ రాజా`. వీటిలో రెండో పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నా తళుక్కున మెరుస్తుందని ఇన్ సైడ్ టాక్. శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో తెరకెక్కించిన ఈ గీతం సినిమాలో ప్రత్యేక సందర్భం లో వస్తుందని, ఇందులో తమన్నా నృత్యాలు ఎస్సెట్ గా నిలుస్తాయని వినికిడి. కాగా, ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోని డిసెంబర్ 30న విడుదల చేస్తారని తెలిసింది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన `సరిలేరు నీకెవ్వరు` జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: