హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్దం’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్ లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నిన్నే నిన్నే అనే లిరికల్ పాటను రిలీజ్ చేశారు.
కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























