సంక్రాంతి త‌రువాత `ప్ర‌భాస్ 20` నెక్స్ట్ షెడ్యూల్?

Prabhas 20 Schedule To Begin Post Sankranthi

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఓ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `జిల్` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే కొంత మేర చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ ని సంక్రాంతి త‌రువాత మొద‌లుపెడ‌తార‌ని తెలిసింది. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జరిపి ప్ర‌భాస్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా అక్టోబ‌ర్ 23న రిలీజ్ చేస్తార‌ని స‌మాచారం. ద‌స‌రా పండ‌క్కి రెండు రోజుల ముందు ప్ర‌భాస్ పుట్టిన‌రోజు వ‌స్తుండ‌డంతో… అక్టోబ‌ర్ 23ని రిలీజ్ డేట్ గా లాక్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇట‌లీ నేప‌థ్యంలో సాగే ఈ ప్రేమ‌క‌థా చిత్రంలో ప్ర‌భాస్ కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా… అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్నాడు. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి `జాన్` అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్నారు. మ‌రి… `డార్లింగ్` అనంత‌రం ప్ర‌భాస్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్… బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 2 =