సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలచిన చిత్రం `ఎఫ్ 2`. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించారు. కాగా, 2019 సంక్రాంతి విజేతగా నిలచిన `ఎఫ్ 2`కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`ఎఫ్ 3` పేరిట తెరకెక్కనున్న ఈ కొనసాగింపు చిత్రానికి సంబంధించి ఇప్పటికే అనిల్ స్క్రిప్ట్ కూడా లాక్ చేశాడని టాక్. అంతేకాదు… తొలి భాగంలో హీరోలుగా నటించిన వెంకీ, వరుణ్ ఇందులోనూ నటిస్తారని, అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో దర్శనమిస్తారని వినికిడి. అలాగే… 2021 సంక్రాంతికి ఈ సీక్వెల్ సందడి చేయనుందని ప్రచారం సాగుతోంది. `ఎఫ్ 2`ని నిర్మించిన `దిల్` రాజు ఈ సినిమాని కూడా నిర్మించే అవకాశముందట. మరి… `ఎఫ్ 2`తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిల్… సీక్వెల్ తోనూ బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో చూడాలి.
కాగా, అనిల్ తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు` 2020 సంక్రాంతికి సందడి చేయనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: