క‌ళ్యాణ్ రామ్ కి జోడీగా కేథ‌రిన్?

Catherine Tresa To Team Up With Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Catherine Tresa Latest News,Actress Catherine Tresa New Movie News,Catherine Tresa Next Film Updates,Catherine Tresa Upcoming Film News,Catherine Tresa Next Project Details

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్… `రావ‌ణ‌` పేరుతో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వేణు మ‌ల్లిడి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్న ఈ చిత్రాన్ని య‌న్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు. 2020 జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… అదే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థాన‌ముండ‌గా… వారిలో ఒక‌రిగా కేథ‌రిన్ ట్రెసా ఎంపికైంద‌ని స‌మాచారం. న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర కావ‌డంతో… కేథ‌రిన్ కూడా స‌బ్జెక్ట్ విన‌గానే వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని వినికిడి.

కాగా, క‌ళ్యాణ్ రామ్ తాజా చిత్రం `ఎంత మంచివాడ‌వురా` జ‌న‌వ‌రి 15న రిలీజ్ కానుండ‌గా… కేథ‌రిన్ అప్ క‌మింగ్ ఫిల్మ్ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.