ఒకే టైమ్ లో రెండు చిత్రాల షూటింగ్ తో నాగ‌చైత‌న్య‌?

Naga Chaitanya To Shoot For Two Movies Simultaneously,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Naga Chaitanya Latest News,Naga Chaitanya New Movie News,Naga Chaitanya Next Film Updates,Naga Chaitanya Next Project Details

ఈ ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` చిత్రాల‌తో విజ‌యాల‌ను అందుకున్న‌ యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌… వ‌చ్చే ఏడాది కూడా అదే జోష్ చూపించే దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. ప్ర‌స్తుతం సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న `ల‌వ్ స్టోరీ` (ప్ర‌చారంలో ఉన్న పేరు)లో న‌టిస్తున్న చైతూ… ఆ సినిమా విడుద‌ల‌య్యాక మ‌రో రెండు సినిమాల‌ను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా స‌మాంత‌రంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటాయ‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో చైతూ న‌టిస్తున్న ప్రేమ‌క‌థా చిత్రం వేస‌విలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌రువాత అటు ప‌ర‌శురామ్ డైరెక్టోరియ‌ల్ తో పాటు ఇటు `సోగ్గాడే చిన్ని నాయ‌నా` సీక్వెల్ `బంగార్రాజు`(క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు) లోనూ చైతూ న‌టించ‌బోతున్నాడు. ఈ రెండు చిత్రాలు జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుండ‌గా… రెండు చిత్రాలను స‌మాంత‌రంగా చేసే దిశ‌గా ఈ అక్కినేని థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ హీరో ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. కాగా.. ప‌ర‌శురామ్ చిత్రం ఏడాది చివ‌ర‌లో రిలీజ్ కానుండ‌గా, `బంగార్రాజు` 2021 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవ‌కాశ‌ముంది. మ‌రి… కొత్త చిత్రాల‌తో చైతూ విజ‌య‌ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − nine =