ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 54
నిఖిల్ ‘కార్తికేయ’కు ఐదేళ్ళు
నవంబర్ ద్వితీయార్ధం నుంచి చిరు, కొరటాల చిత్రం?
అన్నయ్య బాటలో తమ్ముడు
తుది దశలో ‘డిస్కో రాజా’?
విజయ్ సినిమాలకే - మరో ట్విట్టర్ ఎమోజీ
గోపీచంద్ కు అభయమిచ్చిన తేజ
భాగమతి బాలీవుడ్ రీమేక్ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్
'పింక్' రీమేక్ లో పవన్ కళ్యాణ్..?

జెన్యూనిటీకి C/O అడ్రస్ వరుణ్ సందేశ్

విజిల్ మూవీ 4200 థియేటర్స్ లో రిలీజ్
దబాంగ్ 3 మూవీ ట్రైలర్ రిలీజ్
నాగార్జున ‘శివమణి’కి 16 ఏళ్ళు
సీనియర్ డైరెక్టర్ తనయుడి "నిశ్శబ్ధం "
చిరంజీవి ‘విజేత’కు 34 ఏళ్ళు
మొన్న వాణిశ్రీ... నిన్న చిరు... నేడు విజయశాంతి
సంక్రాంతి అనగానే పలు బ్లాక్‌బస్టర్ మూవీస్ కళ్ళముందు కదలాడతాయి. అంతేకాదు... ఈ సీజన్ లోనే పలువురు స్టార్స్ రీ-ఎంట్రీ ఇచ్చిన వైనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కళాభినేత్రి వాణిశ్రీ, మెగాస్టార్ చిరంజీవి వంటి సూపర్ స్టార్స్ సంక్రాంతి సమయంలోనే రీ-ఎంట్రీ ఇచ్చి ఘనవిజయాలు అందుకున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే మరో సూపర్ స్టార్ కూడా ముగ్గుల పండక్కి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ స్టార్ మరెవరో కాదు... లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. `నాయుడమ్మ` (2006) తరువాత చిత్రపరిశ్రమకు దూరమైన మన రాములమ్మ... 2020 సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు`తో వెండితెరపై మరోసారి వెలుగులు పంచేందుకు…
'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్టర్ నుండి మలయాళం రీమేక్..!
వెంకటేశ్ మహా దర్శకత్వంలో వచ్చిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాకు ఎంత మంచి ప్రశంసలు దక్కాయో తెలిసిందే. చిన్న బడ్జట్ లో, ఒరిజినల్ లొకేషన్స్ లో, నాచురల్ యాక్టర్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంశలు సైతం దక్కించుకున్నాడు వెంకటేష్ మహా. ఇక ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకటేష్ మహా రెండో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
నిఖిల్ ‘కార్తికేయ’కు ఐదేళ్ళు
సస్పెన్స్‌కి కామెడీ తోడైతే ఆ ఫార్ములా సూపర్ హిట్టే. ఈ కోవకు చెందిన ఓ సినిమానే... `కార్తికేయ`. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. ‘స్వామి రా రా’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత నిఖిల్, స్వాతి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కూడా అదే బాట పట్టడం విశేషం. చందు మొండేటి దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీలో .. తనికెళ్ళ భరణి, రావురమేష్, ప్రవీణ్, తులసి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.
నవంబర్ ద్వితీయార్ధం నుంచి చిరు, కొరటాల చిత్రం?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... నవంబర్ ద్వితీయార్ధం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఆపై నిరవధికంగా చిత్రీకరణ జరిపి... 2020 ఉగాదికి ఈ సినిమాని విడుదల చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోంది.
అన్నయ్య బాటలో తమ్ముడు
కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన తాజా తమిళ చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఖైదీ’(1983) టైటిల్‌తో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తుది దశలో ‘డిస్కో రాజా’?
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తుండగా... సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
విజయ్ సినిమాలకే - మరో ట్విట్టర్ ఎమోజీ
తమిళ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాదాపు 180కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు కూడా మాములుగా లేవు. ఇప్పుడు బిగిల్ మూవీ కి మరో అరుదైన గౌరవం దక్కింది. బిగిల్ చిత్రానికి ట్విట్టర్ ప్రత్యేకమైన ఎమోజి సింబల్ ఇవ్వడం జరిగింది. గతంలో మెర్సిల్ సినిమా కు ట్విట్టర్ ఎమోజీ రాగా.. ఇప్పుడు బిగిల్ మూవీ కూడా ఈ లిస్ట్ లో చేరింది. బిగిల్ కు కూడా ట్విట్టర్ ఎమోజీ వచ్చింది. కాగా విజయ్ కి జంటగా నయనతార నటిస్తున్న బిగిల్ దీపావళి కానుకగా ఈనెల 25న తమిళ మరియు తెలుగు భాషలలో విడుదల అవుతుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై…
అట్లీ తో ఎన్టీఆర్ మూవీ - క్లారిటీ వచ్చేసినట్టే..!
విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా బిగిల్. ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కల్పాతి ఎస్.అఘోరాం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని విజిల్ గా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీపావళి సందర్బంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది.
గోపీచంద్ కు అభయమిచ్చిన తేజ
పాపం కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన 'గోపీచంద్' కు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ మాత్రం దక్కట్లేదు. గతకొద్ది కాలంగా ప్లాప్స్ తప్పించి సక్సెస్ అనేది చూడలేదు. ఇటీవల వచ్చిన 'చాణక్య' సినిమాపై అంచనాలు పెంచుకున్నా.. ఆ అంచనాలను అందుకోలేకపోయాడు 'చాణక్య'. దీనితో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గోపీచంద్ తో సినిమా అంటే నిర్మాతలు భయపడుతున్నారు. ఇటీవలే గోపీచంద్ చేతులోంచి ఓ సినిమా జారిపోయింది. సంపత్ నందితో ఓ సినిమా పట్టాలెక్కాల్సివుంది. అది సెట్స్‌పైకి వెళ్లేంత వరకూ సినిమా ఉంటుందో లేదో కూడా…
భాగమతి బాలీవుడ్ రీమేక్ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ మూవీ భాగమతి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు భాగమతి మూవీ హిందీ లో రీమేక్ కానుంది. తెలుగు వెర్షన్ దర్శకుడు అశోక్ ఈ హిందీ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు . అనుష్క రోల్ కు యంగ్ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ భూమి పెడ్నేకర్ ఎంపిక అయ్యారు. దర్శకుడు అశోక్ లొకేషన్స్ ను సెలెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది.
'పింక్' రీమేక్ లో పవన్ కళ్యాణ్..?
టాలీవుడ్ లో అభిమానులు కాకుండా భక్తులు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పొచు. కానీ తమ అభిమానులను కాస్త నిరాశ పరిచి సినిమాలకు గుడ్ బై చెప్పి మొత్తం రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ మధ్య పవన్ మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నట్టు వార్తలు రావడంతో.. తను ఇంకా సినిమాలు చేయనని అప్పట్లో క్లారిటీ ఇచ్చేసాడు. కానీ పవన్ చెప్పినా కూడా అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.

జెన్యూనిటీకి C/O అడ్రస్ వరుణ్ సందేశ్
బిగ్ బాస్ 3 హౌస్ లో జెన్యూనిటీ కి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ఏ మాత్రం తడుముకోకుండా మనకు గుర్తొచ్చే పేరు వరుణ్ సందేశ్. కపుల్స్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చినా కూడా వరుణ్ ఎప్పుడూ వితికాను ఒక కంటెస్టెంట్ లాగానే చూసుకుంటూ వచ్చాడు. అంతే కాదు మొదటినుండీ ఎవరైనా తప్పు చేసినా.. మొహం మీదే చెప్పేయడం... తాను కోపంలో ఏమన్నా అన్నా కూడా.. తర్వాత తనే వెళ్లి సారీ చెప్పడం.. ఆఖరికి వితికా తప్పు చేసినా కూడా అందరిముందు స్ట్రైట్ గా చెప్పేయడం ఇలా జెన్యూనిటీ కి షర్ట్ ప్యాంటు వేస్తే ఎలా ఉంటాడో అలా ఉండటంతో అందరికీ మోస్ట్ ఫెవరెట్ కంటెస్టెంట్ అయ్యాడు. ఎంతలా అంటే బిగ్ బాస్ విన్నర్ ఇంక వరుణ్ సందేశే అని ఫిక్స్ అయిపోయారు…

విజిల్ మూవీ 4200 థియేటర్స్ లో రిలీజ్
AGS ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ , నయనతార జంటగా ఫుట్ బాల్ క్రీడానేపథ్యం లో రూపొందిన కమర్షియల్ ఎంటర్ టైనర్ బిగిల్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజిల్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ కానున్నాయి. బిగిల్ తెలుగు, తమిళ వెర్షన్స్ 4200 థియేటర్స్ లో రిలీజ్ కావడం విశేషం. బిగిల్ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజిల్ మూవీ ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ S కోనేరు రిలీజ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ రిలీజ్ చేసిన మత్తువదలరా మూవీ ఫస్ట్ లుక్
మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అంతా కొత్తవారితో రూపొందుతున్న మత్తువదలరా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతులమీదుగా ఈ రోజు రిలీజయింది . నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా తో టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. సింహ కోడూరి బ్లాక్ బస్టర్ రంగస్థలం మూవీ కి దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
దబాంగ్ 3 మూవీ ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తం గా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ నటించిన మూవీ రిలీజంటే అభిమానులకు పెద్ద పండగే. హీరో సల్మాన్ ఖాన్ చుల్ బుల్ పాండే గా నటించిన దబాంగ్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ దబాంగ్ 2 కూడా ఘనవిజయం సాధించింది. దబాంగ్ మూవీ సిరీస్ లో దబాంగ్ 3 రూపొందింది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రాన్ బ్రాడ్ కాస్టింగ్ &మీడియా లిమిటెడ్ బ్యానర్స్ పై ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , సోనాక్షి సిన్హా జంటగా రూపొందిన దబాంగ్ 3 మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది.
నార్త్ డామినేషన్ కు బ్రేక్ వేసిన వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ స్టార్ ప్రభాస్
రానున్న నవంబర్ 11 నాటికి ప్రభాస్ తెలుగు తెరకు పరిచయమై 17 ఏళ్లు పూర్తవుతాయి.2002 నవంబర్ 11న విడుదలైన ' ఈశ్వర్' చిత్రం ద్వారా రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా పరిచయమైన ప్రభాస్ ను చూసి కుర్రాడు బాగున్నాడు... బాగానే చేశాడు... ఫర్వాలేదు... పైకొస్తాడు... ఇలాంటి అత్తెసరు మార్కుల పరిమిత ప్రశంసలు మాత్రమే వినిపించాయి. తొలి చిత్రమైన ఈశ్వర్, మలి చిత్రమైన రాఘవేంద్ర వరకు అలాంటి బొటాబొటీ మార్కులు సంపాదించుకున్న ప్రభాస్ మీద మూడవ చిత్రమైన 'వర్షం' ప్రశంసల వర్షాన్ని, కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపించింది.అలా తెలుగులో ఆశించిన విజయాన్ని అందుకోవటానికి మూడవ చిత్రం దాకా నిరీక్షించిన ప్రభాస్ ఈ రోజున 'ఆల్ ఇండియా…

డిసెంబర్ రిలీజ్ కే ఇంట్రెస్ట్ చూపుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు పలు వార్తలు వస్తున్నాయి.
నాగార్జున ‘శివమణి’కి 16 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జున పలు కాప్ స్టోరీస్‌లో నటించారు. వాటిలో ‘శివమణి 98480 22338’ది ప్రత్యేక స్థానం. `నా పేరు శివమణి... నాకు కొంచెం మెంటల్` అంటూ అంతకుముందు ఎన్నడూ కనిపించని ఓ స్పెషల్ బాడీ లాంగ్వేజ్‌తో ఈ చిత్రంలో సందడి చేశారు నాగ్. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అసిన్, రక్షిత కథానాయికలుగా నటించారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, అలీ, సంగీత, ఏవీయస్, ఎం.ఎస్.నారాయణ, బండ్ల గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నికోలస్ స్పార్క్స్ రచించిన ‘మెసేజ్ ఇన్ ఎ బాటిల్’ నవల ఆధారంగా ఇందులోని కొన్ని సన్నివేశాలను రూపొందించారు. ఇక పూరి అందించిన సంభాషణలు సినిమాకి ప్రత్యేక…
సీనియర్ డైరెక్టర్ తనయుడి "నిశ్శబ్ధం "
జరిగిన కథ , తల్లితండ్రులు, రామాలయం, లంబాడోళ్ళ రాందాసు మూవీస్ దర్శకుడు K .బాబూరావు తనయుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దం 5భాషలలో రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై రూపొందిన నిశ్శబ్దం మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైకేల్ మ్యాడ్సన్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు.
చిరంజీవి ‘విజేత’కు 34 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి, అగ్ర దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిది విజయవంతమైన జోడి. ‘న్యాయం కావాలి’(1981)తో మొదలైన వీరి ప్రయాణం ‘ముఠామేస్త్రి’(1993) వరకు సాగింది. అలా... వీరిద్దరి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘విజేత’ ఒకటి. చెల్లెలి పెళ్ళి కోసం తన మూత్రపిండాన్ని(కిడ్నీ) డొనేట్ చేసిన ఓ అన్నయ్య కథే ఈ `విజేత`. భానుప్రియ కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ‘ఊర్వశి’ శారద, జె.వి.సోమయాజులు, రంగనాథ్, గిరిబాబు, నూతన్ ప్రసాద్, శుభ, శ్రీలక్ష్మి, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, జంధ్యాల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలనటుడిగా తొలి అడుగులు…