విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా బిగిల్. ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కల్పాతి ఎస్.అఘోరాం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని విజిల్ గా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీపావళి సందర్బంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా గతకొద్ది కాలంగా అట్లీ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి వార్తలు గానే ఉన్నాయి కానీ ఇంతవరకూ క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై క్లారిటీ వచ్చేసినట్టే తెలుస్తుంది. విజిల్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న అట్లీ..ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకునే వార్త ప్రకటించాడు. తన సినిమా విడుదలైన ప్రతి సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతుంటారని… ఆయన పట్ల నాకు చాలా గౌరవం ఉంది.. త్వరలోనే ఎన్టీఆర్ తో తన తెలుగు చిత్రానికి సంబందించి వార్త వెలువడుతుందని అట్లీ వేదికపై ప్రకటించాడు. దీనితో ఎప్పటినుండో వస్తున్న రూమర్లకు బ్రేక్ పడింది.
మరి ‘బిగిల్’ తర్వాత అట్లీ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో అట్లీ రీమేక్ చేయనున్నాడట. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో అట్లీ సినిమా ఉండొచ్చు అంటున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: