వెంకటేశ్ మహా దర్శకత్వంలో వచ్చిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాకు ఎంత మంచి ప్రశంసలు దక్కాయో తెలిసిందే. చిన్న బడ్జట్ లో, ఒరిజినల్ లొకేషన్స్ లో, నాచురల్ యాక్టర్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంశలు సైతం దక్కించుకున్నాడు వెంకటేష్ మహా. ఇక ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకటేష్ మహా రెండో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మలయాళంలో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ‘మహేషింటే ప్రతీకారం అక్కడ మంచి సూపర్ హిట్ అయింది. 2016లో దిలీశ్ పోతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ మంచి వసూళ్ళు సాధించడంతో పాటు.. జాతీయ అవార్డును కూడా ఈ సినిమా గెలుచుకుంది. తమిళంలో ఈ సినిమాను దర్శకుడు ప్రియదర్శన్ రీమేక్ చేశారు. ఇప్పుడు అలాంటి సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు వెంకటేశ్ మహా. అంతే కాదు ఫాహద్ ఫాజిల్ పాత్రలో సత్య దేవ్ నటించనున్నాడని సమాచారం. నవంబర్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందట. ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రానుంది.
మరి మొదటి సినిమాకి మనిషిలోని ప్రేమని వేరు వేరు దశల్లో చూపించిన వెంకటేష్ మహా, ఇప్పుడు అదే మనిషిలోని ప్రతీకారాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. చూద్దాం మొదటి సినిమాతో ప్రశంసలు దక్కించుకున్న వెంకటేష్ మహా..ఈ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుంటాడేమో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























