నాగార్జున ‘శివమణి’కి 16 ఏళ్ళు

Nagarjuna Trend Setting Movie Shivamani Completes 16 Years,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Shivamani Movie Completes 16 Years,Nagarjuna Trend Setting Movie Shivamani,Shivamani Telugu Movie

‘కింగ్’ నాగార్జున ప‌లు కాప్‌ స్టోరీస్‌లో న‌టించారు. వాటిలో ‘శివమణి 98480 22338’ది ప్ర‌త్యేక స్థానం. `నా పేరు శివ‌మ‌ణి… నాకు కొంచెం మెంట‌ల్‌` అంటూ అంత‌కుముందు ఎన్న‌డూ క‌నిపించ‌ని ఓ స్పెష‌ల్ బాడీ లాంగ్వేజ్‌తో ఈ చిత్రంలో సంద‌డి చేశారు నాగ్‌. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అసిన్, రక్షిత కథానాయికలుగా నటించారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, అలీ, సంగీత, ఏవీయ‌స్‌, ఎం.ఎస్.నారాయణ, బండ్ల గణేష్ తదితరులు ముఖ్య‌ పాత్రలు పోషించారు. నికోలస్ స్పార్క్స్ రచించిన ‘మెసేజ్ ఇన్ ఎ బాటిల్’ నవల ఆధారంగా ఇందులోని కొన్ని స‌న్నివేశాల‌ను రూపొందించారు. ఇక పూరి అందించిన సంభాష‌ణ‌లు సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భాస్కరభట్ల, కందికొండ, విశ్వ, చక్రి గీత రచన చేయగా… పూరీ ఆస్థాన సంగీత దర్శకుడు చక్రి స్వరాలు సమకూర్చాడు. “మోనా మోనా”, “ఏనాటికి”, “ఏలో ఏలో”, “గోల్డ్ రంగు”, “రామ రామ”, “సున్ సున్ సుంద‌రి”… ఇలా ఇందులోని ప్రతీ పాట అప్పట్లో విశేషాదరణ పొందింది. డి.వి.వి.దానయ్య సమర్పణలో వైష్ణో అకాడ‌మీ పతాకంపై పూరీ జగన్నాథ్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించాడు. 2003 అక్టోబర్ 23న విడుదలై విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసిన‌ ‘శివమణి’… నేటితో 16 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − three =