చిరంజీవి ‘విజేత’కు 34 ఏళ్ళు

Mega Star Chiranjeevi Blockbuster Hit Movie Vijetha Completed 34 Years,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Vijetha Completed 34 Years,Chiranjeevi Blockbuster Hit Movie Vijetha,34 Years of Vijetha Movie

మెగాస్టార్ చిరంజీవి, అగ్ర దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిది విజయవంతమైన జోడి. ‘న్యాయం కావాలి’(1981)తో మొదలైన వీరి ప్రయాణం ‘ముఠామేస్త్రి’(1993) వరకు సాగింది. అలా… వీరిద్ద‌రి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘విజేత’ ఒకటి. చెల్లెలి పెళ్ళి కోసం తన మూత్రపిండాన్ని(కిడ్నీ) డొనేట్‌ చేసిన ఓ అన్నయ్య కథే ఈ `విజేత‌`. భానుప్రియ కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ‘ఊర్వశి’ శారద, జె.వి.సోమయాజులు, రంగనాథ్, గిరిబాబు, నూతన్ ప్రసాద్, శుభ, శ్రీలక్ష్మి, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, జంధ్యాల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలనటుడిగా తొలి అడుగులు వేయ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు… చక్రవర్తి వీనుల‌విందైన‌ బాణీలు అందించారు. ముఖ్యంగా “నీ మీద నాకు”, “జీవితమే ఒక పయనం”, “6 ఓ క్లాక్” వంటి గీతాలు యువ‌త‌ను అలరించగా… సంద‌ర్భోచితంగా సాగే “ఎంత ఎదిగి పోయావయ్యా” హృద్యంగా ఉంటుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంతో చిరంజీవి రెండోసారి `ఫిల్మ్‌ఫేర్‌`ను సొంతం చేసుకున్నారు. కాగా… బెంగాలీ చిత్రం ‘సాహెబ్’కు రీమేక్‌గా `విజేత‌` రూపొందింది. 1985 అక్టోబర్ 23న విడుదలై ఘనవిజయం సాధించిన ‘విజేత’… నేటితో 34 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =