నార్త్ డామినేషన్ కు బ్రేక్ వేసిన వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ స్టార్ ప్రభాస్

#HappyBirthdayPrabhas, 2019 Latest Telugu Movie News, Actor Prabhas Birthday Special Tribute, Happy Birthday to Prabhas, Japan Begins Prabhas Birthday Celebrations, Prabhas Birthday Bash Begins in Japan Already, Prabhas Birthday Celebrations, Prabhas Birthday Special, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema News, Tribute To Prabhas On His Birthday

రానున్న నవంబర్ 11 నాటికి ప్రభాస్ తెలుగు తెరకు పరిచయమై 17 ఏళ్లు పూర్తవుతాయి.2002 నవంబర్ 11న విడుదలైన ‘ ఈశ్వర్’ చిత్రం ద్వారా రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా పరిచయమైన ప్రభాస్ ను చూసి కుర్రాడు బాగున్నాడు… బాగానే చేశాడు… ఫర్వాలేదు… పైకొస్తాడు… ఇలాంటి అత్తెసరు మార్కుల పరిమిత ప్రశంసలు మాత్రమే వినిపించాయి. తొలి చిత్రమైన ఈశ్వర్, మలి చిత్రమైన రాఘవేంద్ర వరకు అలాంటి బొటాబొటీ మార్కులు సంపాదించుకున్న ప్రభాస్ మీద మూడవ చిత్రమైన ‘వర్షం’ ప్రశంసల వర్షాన్ని, కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపించింది.అలా తెలుగులో ఆశించిన విజయాన్ని అందుకోవటానికి మూడవ చిత్రం దాకా నిరీక్షించిన ప్రభాస్ ఈ రోజున ‘ఆల్ ఇండియా సూపర్ స్టార్’ స్థాయికి ఎదగటం మనందరికీ గర్వకారణం. 17 సంవత్సరాలలో 19 చిత్రాలలో నటించిన ప్రభాస్ గత మూడు చిత్రాలైన బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కంక్లూషన్, సాహో చిత్రాల హ్యాట్రిక్ విజయాలతో పాన్ ఇండియన్ స్టార్ గా శిఖరాగ్ర స్థాయిలో నిలిచారు.1979 అక్టోబర్ 23న జన్మించిన ప్రభాస్ ఈ అక్టోబర్ 23తో 40వ పడిలోకి ప్రవేశిస్తున్నారు.

ఈ సందర్భంగా ఇండియన్ నేషనల్ స్టార్ గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అద్భుతమైన పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రభాస్ కు జన్మదిన శుభాభినందనలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక వ్యాసాన్ని సమర్పిస్తోంది ” ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”

ఉత్తరాది ఆధిపత్యాన్ని అధిగమించి :

భౌగోళికంగా, రాజకీయంగా , నాగరిక సంప్రదాయాలపరంగా మనందరం భారతీయులం అయినప్పటికీ, భారతదేశం మనందరిదే అయినప్పటికీ ఉత్తర దక్షిణ భారతాల మధ్య అంతర్లీనంగా వైవిధ్య వైరుధ్యాలు ప్రస్పుటంగా కనిపిస్తూనే ఉంటాయి. ఉద్యోగ , ఉపాధి అవకాశాలు, నిధుల కేటాయింపు, పరిశ్రమల స్థాపన, ఆల్ ఇండియా సర్వీసెస్ , నేషనల్ అవార్డ్స్ వంటి అన్ని విషయాలలో దక్షిణ భారతం వివక్షకు గురవుతూనే ఉంది. ఉత్తర దక్షిణ భారతాల మధ్య ఇలాంటి వివక్షాపూరిత ధోరణి అన్ని రంగాలతో పాటు సినిమా రంగంలో కూడా ఉంది అనటానికి ఉదాహరణలు కోకొల్లలు. జాతీయ అవార్డులలో, జాతీయ పురస్కారాలైన పద్మ అవార్డులలో ఉత్తరాదికి దోసెడు, దక్షిణాదికి పిడికెడు అన్న పాలసి అనాది నుండి కొనసాగుతూనే ఉంది. ఉత్తర దక్షిణ భారతాల మధ్య ఇలాంటి వివక్ష నెలకొన్న నేపథ్యంలో ఒక దక్షిణ భారత నటుడు ఉత్తరాది అగ్రతారల ఆధిపత్యాన్ని అధిగమించి ‘పాన్ ఇండియా స్టార్’ గా ఎదగటం, వెలగటం దక్షిణాది సినీరంగానికే గర్వకారణం. గతంలో దక్షిణాదికి చెందిన కొందరు స్టార్స్ ఉత్తరాదిన కూడా విజయబావుటా ఎగురవేసినప్పటికి ఉత్తరాది తారల ఆధిపత్యాన్ని సవాలు చేయలేకపోయారు. కానీ ఈ రోజున ఉత్తరభారతంలో ఏ సినిమా విజయమైనా ‘నాన్ బాహుబలి’ రికార్డ్స్ కు పరిమితమవడమే తప్ప
బాహుబలి రికార్డ్స్ దరిదాపులకు కూడా వెళ్లలేకపోతున్నాయి. అలాగే ఉత్తరాది అగ్రతారల స్టార్డమ్, స్టార్ వాల్యూ, స్టార్ ఇమేజ్ లు ‘బాహుబలి స్టార్ ప్రభాస్’ ఇమేజ్ ముందు వెలవెలబోతున్నాయి అన్నది నిజం.
బాలీవుడ్ లో ఖాన్స్ త్రయం షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల దశాబ్దాల ఆధిపత్యాన్ని కలెక్షన్ల పరంగా, పాపులారిటీ పరంగా అధిగమించి The New Indian Super Star గా అవతరించిన ప్రభాస్ పట్ల విస్మయానంద భరితంగా చూస్తుంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.

ప్రపంచవ్యాప్తంగా 2700 కోట్లకు పైగా క్కొల్లగొట్టి సమీప భవిష్యత్తులో ఏ ఇండియన్ సినిమా బీట్ చేయలేని
అన్బిటబుల్ రికార్డులను నెలకొల్పిన బాహుబలి సిరీస్ ప్రభాస్ కు ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించిపెట్టింది. హిందీ చిత్రాల ద్వారా వరల్డ్ వైడ్ పాపులారిటీ పొందటం కంటే ఒక ప్రాంతీయ భాషా చిత్రం ద్వారా ఒక రీజనల్ స్టార్ కేవలం మూడంటే మూడే చిత్రాలతో ఇంటర్నేషనల్ పాపులారిటీని సాధించటం సంథింగ్ గ్రేట్, సంథింగ్ స్పెషల్ అండ్ సంథింగ్ యూనిక్. గతంలో కొందరు ఉత్తరాది స్టార్స్ కు, కొందరు దక్షిణాది స్టార్స్ కు నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చినప్పటికీ ‘పాన్ ఇండియా స్టార్’ అనే పదానికి నిజమైన నిర్వచనంగా నిలిచిన ‘వన్ అండ్ ఓన్లీ’ అండ్ ‘ఫస్ట్ అండ్ ద బెస్ట్’ స్టార్ ప్రభాస్ అన్నది నిర్వివాదాంశం.

ఈ రోజున ఇండియన్ ఫిలిం హిస్టరీ ‘బిఫోర్ బాహుబలి అండ్ ఆఫ్టర్ బాహుబలి’ గా వర్గీకృతం కాగా అలాంటి ప్రతిష్టాత్మక చిత్ర కథానాయకుడిగా , టైటిల్ రోలర్ గా ప్రభాస్ కు వచ్చిన పాపులారిటీని అంచనా వేయడం ఫిలిం ట్రేడ్ కు ఒక సవాలుగా మారింది. ఎందుకంటే బాలీవుడ్ స్టార్స్ పలుకుబడి, ప్రాబల్యాలను కాదని , ఉత్తర దక్షిణ భారతాల వివక్షను పక్కన పెట్టి ఒక సౌత్ ఇండియన్ స్టార్ కు పాన్ ఇండియా స్టార్ డమ్ ను కట్టబెట్టాలి అంటే అది అంత తేలికైన పని కాదు. కానీ బాహుబలి సృష్టించిన ప్రభంజనం కలెక్షన్ల కనక వర్షం రూపంలో కళ్లముందు కనిపిస్తున్నప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో మాత్రమే మన సౌత్ ఇండియన్ సినిమాకు నేషనల్ మీడియా ఈ క్రెడిట్ కట్టబెట్టింది తప్ప మామూలు పరిస్థితుల్లో అయితే ఈ ఆధిపత్య విజయాన్ని ఒప్పుకునేది కాదు. మొత్తానికి ఒక ప్రాంతీయ తెలుగు భాషా చిత్రం, ఒక తెలుగు హీరో ఈ రోజున మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాపర్స్ గా విజయ బావుటా ఎగుర వేయటం మనందరం గర్వించదగిన చారిత్రక విజయం.

అన్ సంగ్ సూపర్ హిట్ సాహో:

అలా బాహుబలి స్టార్ గా నేషనల్ వైడ్ స్టార్ డమ్ సాధించిన ప్రభాస్ కు వచ్చింది నిజమైన, బలమైన, స్థిరమైన పాపులారిటీయా లేక కేవలం బాహుబలి విజయం వరకే పరిమితమైన లిమిటెడ్ పాపులారిటీయా ? అన్నది కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయింది. కొన్ని నేషనల్ వెబ్సైట్స్, టీవీ చానల్స్ సల్మాన్ ఖాన్- ప్రభాస్ ల పాపులారిటీ మీద ‘హూ ఈజ్ ద సూపర్ స్టార్’ అనే చర్చలు కూడా నిర్వహించాయి. అలాంటి చర్చలు గతంలో ఏ సౌత్ ఇండియన్ స్టార్ మీద నిర్వహించబడ లేదు. అలా బాలీవుడ్ బడా స్టార్స్ స్టార్ డమ్ కు సవాలు విసిరిన ప్రభాస్ పాపులారిటీ నిజమైనది, బలమైనది, స్థిరమైనది అని చెప్పటానికి ఉత్తరాదిన’సాహు’ సాధించిన ఘన విజయాన్నే బలమైన ఉదాహరణ గా చెప్పుకోవాలి.

నిజానికి ప్రభాస్ పాపులారిటీ బాహుబలి సిరీస్ సక్సెస్ వరకే పరిమితం …. బాహుబలి తర్వాత ప్రభాస్ కు, తదుపరి సినిమా సాహో కు అంత సీన్ లేదు అన్నారు… అనుకున్నారు. బాహుబలి తరువాత సినిమా కాబట్టి సాహో మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో అన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ‘సాహో’ కు చాలా చాలా నెగిటివ్ రివ్యూ ఇచ్చింది మీడియా. ముఖ్యంగా ఉత్తరాది మీడియా అయితే హాఫ్ మార్క్ రేటింగ్
తో అవమానకరమైన సమీక్షలు రాసింది. నిజానికి అంత నెగిటివ్ రివ్యూ వచ్చిన తరువాత వేరొక స్టార్ సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయి అడ్రస్ లేకుండా పోయి ఉండేది. మరి ఇంత నెగటివ్ రివ్యూ మీద కూడా 300కోట్ల నెట్ 400 కోట్ల పైచిలుకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఇండియాలోనే టాప్ టెన్ నెట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన ‘అన్ సంగ్ హిట్’ సాహో.

దీన్నిబట్టి ప్రభాస్ పాపులారిటీ బాహుబలి సిరీస్ కు మాత్రమే పరిమితం కాలేదు… ఇంత నెగిటివ్ రిపోర్టులో కూడా సాహో అంత కలెక్షన్స్ రాబట్టింది అంటే దానికి స్పష్టమైన ఏకైక కారణం ప్రభాస్ పాపులారిటీ అని అర్థం అవుతుంది. ఏ మీడియా అయితే సాహో మీద హాఫ్ రేటింగ్స్ తో దారుణమైన రివ్యూలు రాసిందో
అదే మీడియా సాహో కలెక్షన్ల ప్రభంజనాన్ని ఘనంగా రిపోర్ట్ చేసింది.

నిజానికి సాహో విజయం ఒక ‘అన్ సంగ్’ విక్టరీ గా మిగిలిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఫ్యాక్టర్స్ అండ్ సోర్సెస్ నుండి దాదాపు 425 కోట్ల గ్రాస్ సాధించిన సాహో చిత్ర విజయం గురించి దర్శకనిర్మాతలు గాని, హీరో గాని, డిస్ట్రిబ్యూటర్స్ గానీ పట్టించుకుని ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎవరూ పట్టించుకోక పోయినప్పటికీ ఇంత నెగిటివ్ వేవ్ లో కూడా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అంటే ప్రభాస్ పాపులారిటీకి ఇంతకుమించిన నిదర్శనం ఏం కావాలి?

No Attitude.. Only Behavior

ప్రభాస్ కు నార్త్ లో ఇంత తక్కువ కాలంలో ఇంత గొప్ప పాపులారిటీ రావటానికి మూడు వరుస విజయాలు మాత్రమే కారణం కాదు. తన వండర్ఫుల్ బిహేవియర్ కూడా ప్రభాస్ పాపులారిటీకి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో వ్యక్తుల ప్రవర్తన, మాటతీరు, బాడీ లాంగ్వేజ్, కూర్చునే విధానం, సభ్యత, సంస్కారం ఇలా ప్రతి విషయం కౌంట్ అవుతుంది. యాటిట్యూడే బిహేవియర్ గా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా, అభిమానంగా ‘డార్లింగ్’ అనే సంభోధనతో పలకరించే ప్రభాస్ ప్రవర్తన నార్త్ మీడియాలో, పబ్లిక్ లో అందరికీ విపరీతంగా నచ్చేసింది. బాహుబలి సిరీస్ తో ఆసేతు హిమాచలాన్ని ఆకట్టుకున్న ఒక యాక్షన్ హీరో బిహేవియర్ ఇంత డౌన్ టు ఎర్త్ గా ఉండటం ఉత్తరాది వారిని విశేషంగా అలరించింది. అందమైన ఆరడుగుల ఆ భారీ కటౌట్ ఇంత సౌమ్యంగా, సరదాగా, సన్నిహితంగా మెలగటం తెగ నచ్చేయటంతో బాలీవుడ్ మీడియా ప్రభాస్ ను బాగా ఓన్ చేసుకుంది. ఈ విధంగా యాటిట్యూడ్ తో కాకుండా సంస్కారవంతమైన బిహేవియర్ తో ఆకట్టుకోవడం కూడా ప్రభాస్ పాపులారిటీకి ఒక ప్రధాన కారణం అయింది. మొత్తానికి బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కంక్లూషన్ అండ్ సాహో అనే మూడు సూపర్ డూపర్ హిట్స్ ద్వారా హ్యాట్రిక్ కొట్టి ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా అవతరించిన ప్రభాస్ ఈ విజయ పరంపరను ఇదే స్థాయిలో కొనసాగించి ఉత్తరాది ఆధిపత్య ధోరణిని నిలువరించిన ‘ వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ స్టార్’ గా చరిత్రలో నిలిచిపోవటం తథ్యం. ప్రతిష్టాత్మక మేడమ్ ట్యూసాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహ ప్రతిష్టాపన అనే ఘనతను సాధించిన
తొలి సౌత్ ఇండియన్ స్టార్ గా చరిత్ర పుటలలో నిలిచిపోయిన ప్రభాస్ మరెన్నో చారిత్రక విజయాలతో ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా కలకాలం నిలవాలని ఆశిస్తూ, అభిలషిస్తూ జన్మదిన శుభాభినందనలు పలుకుతోంది ‘ ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కం’ .

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here