జెన్యూనిటీకి C/O అడ్రస్ వరుణ్ సందేశ్

Varun Sandesh Being Genuine In Bigg Boss House,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Bigg Boss Varun Sandesh,Varun Sandesh Latest News 2019,Bigg Boss 3 Telugu Updates,Bigg Boss Telugu Season 3

బిగ్ బాస్ 3 హౌస్ లో జెన్యూనిటీ కి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ఏ మాత్రం తడుముకోకుండా మనకు గుర్తొచ్చే పేరు వరుణ్ సందేశ్. కపుల్స్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చినా కూడా వరుణ్ ఎప్పుడూ వితికాను ఒక కంటెస్టెంట్ లాగానే చూసుకుంటూ వచ్చాడు. అంతే కాదు మొదటినుండీ ఎవరైనా తప్పు చేసినా.. మొహం మీదే చెప్పేయడం… తాను కోపంలో ఏమన్నా అన్నా కూడా.. తర్వాత తనే వెళ్లి సారీ చెప్పడం.. ఆఖరికి వితికా తప్పు చేసినా కూడా అందరిముందు స్ట్రైట్ గా చెప్పేయడం ఇలా జెన్యూనిటీ కి షర్ట్ ప్యాంటు వేస్తే ఎలా ఉంటాడో అలా ఉండటంతో అందరికీ మోస్ట్ ఫెవరెట్ కంటెస్టెంట్ అయ్యాడు. ఎంతలా అంటే బిగ్ బాస్ విన్నర్ ఇంక వరుణ్ సందేశే అని ఫిక్స్ అయిపోయారు అందరూ. అందుకే తను నామినేషన్ లోకి వచ్చినా కూడా మొదట సేవ్ అయింది తనే. ఓటింగ్ కూడా తనకే ఎక్కువ వచ్చేది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇంత ఫామ్ లో ఉన్న వరుణ్ ఈ మధ్య కాస్త నెగిటివిటీ ని పెంచుకున్నాడు. దీనికి కారణం ఏంటో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హౌస్ లో జరిగిన రెండు, మూడు సంఘటనల వల్ల వరుణ్ కి ఉన్న క్రేజ్ తగ్గింది. అందుకే మొన్న జరిగిన నామినేషన్ లలో స్టార్టింగ్ లో ఓటింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వరుణ్.. మొన్న నామినేషన్ లోకి రాగా నాలుగో స్థానంలోకి వెళ్ళాడు. దీనితో వరుణ్ పై ఎంత నెగిటివిటీ ఉందో అర్ధమవుతుంది.

ఇదిలా ఉండగా వరుణ్ గేమ్ కు వితికా సగం అడ్డంకిగా ఉందని ఇటీవల చాలా మంది కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వితికా కూడా లేదు.. ఎలిమినేషన్ అయిపోయింది. దీనితో వరుణ్ మళ్ళీ బ్యాక్ టూ ఫామ్ అయ్యాడు. మొన్న రాహుల్ తో జరిగిన టాస్క్ లో వరుణ్ ను చూస్తే అది అర్ధమవుతుంది. అంతే కాదు జెన్యూనిటీ ని జేబులో పెట్టుకొని తిరిగే వరుణ్ ఆ టాస్క్ లో కూడా మరోసారి తన జెన్యూనిటీ ని చూపించుకున్నాడు. రెండు గన్నీ బాగ్స్ లో థర్మాకోల్ బాల్స్ ను పూర్తిగా పడేయాల్సింది. ఈ టాస్క్ లో రాహుల్ తాను ఓడిపోయాడనుకొని వెళ్తుండగా.. వరుణ్ ఇంకా ఉన్నాయి అని పిలిచి మరి చెప్పాడు. నిజానికి తాను మొత్తం కింద పడేసి ఉండొచ్చు… కానీ అలా చేయలేదు. ఇక్కడే తన జెన్యూనిటీ కనిపిస్తుంది. ఆ గేమ్ కనుక రాహుల్ ఓడిపోయివుంటే గేమ్ వేరేలా ఉండేది. టికెట్ టు ఫినాలే వేరే ఎవరికైనా వచ్చేదేమో.

ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే.. సింగిల్ కంటెస్టెంట్ గా ఇంట్లోకి వెళ్లిన వల్ల పరిస్థితి.. కపుల్ గా ఇంట్లోకి వెళ్లిన వాళ్ళ పరిస్థితి వేరేలా ఉంటుంది. నిజం చెప్పాలంటే సింగిల్ కంటెస్టెంట్ గా ఆడటమే ఓరకంగా ఈజీ. కపుల్ గా వచ్చినప్పుడు భార్య కోసం భర్త.. భర్త కోసం భార్య కొన్ని కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చేసుకోవడం కామనే. అలా అని వితిక, వరుణ్ ఇద్దరూ ఒకర్ని ఒకరు సపోర్ట్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. తప్పు చేసినప్పుడు ఇద్దరూ తిట్టుకున్నారు… ప్రశ్నించుకున్నారు.. నిర్మొహమాటంగా నామినేషన్ చేసుకున్నారు.. అసలు వేరే ఎవరైనా కపుల్ ను పంపించి ఉంటే.. ఈ మాత్రమైనా ఆడివుండే వాళ్ళో..?లేదో..?. అంతేనా ఇప్పుడున్న హౌస్ మేట్స్ భార్య కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు అని గొడవపెడుతున్నారు.. కానీ ఆ పొజిషన్ లో వాళ్ళ భర్తలు ఉన్నా అదే చేసేవాళ్లు.. అది అందరికి తెలిసిన నిజమే. ఏదిఏమైనా బిగ్ బాస్ 3 లో జెన్యూన్ కంటెంట్ అంటే వరుణే గుర్తొస్తాడు. అలాంటి వరుణ్ ను గెలిపించడానికి మీ ఓటు ద్వారా సపోర్ట్ చేయండి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.