పాపం కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన ‘గోపీచంద్’ కు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ మాత్రం దక్కట్లేదు. గతకొద్ది కాలంగా ప్లాప్స్ తప్పించి సక్సెస్ అనేది చూడలేదు. ఇటీవల వచ్చిన ‘చాణక్య’ సినిమాపై అంచనాలు పెంచుకున్నా.. ఆ అంచనాలను అందుకోలేకపోయాడు ‘చాణక్య’. దీనితో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గోపీచంద్ తో సినిమా అంటే నిర్మాతలు భయపడుతున్నారు. ఇటీవలే గోపీచంద్ చేతులోంచి ఓ సినిమా జారిపోయింది. సంపత్ నందితో ఓ సినిమా పట్టాలెక్కాల్సివుంది. అది సెట్స్‌పైకి వెళ్లేంత వరకూ సినిమా ఉంటుందో లేదో కూడా తెలీదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలో గోపీచంద్ తో సినిమా చేయడానికి తేజ రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాస్త కెరీర్ లో వెనక్కి తగ్గిన గోపీచంద్ కు తేజ అభయమిచ్చినట్టు తెలుస్తుంది. గోపీచంద్ కోసం తేజ ఓ కథ సిద్ధం చేశాడట. నిర్మాత కూడా రెడీగా ఉన్నాడట. గోపీచంద్ ఓకే అంటే ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో.
ఇదిలా ఉండగా కెరీర్ మొదట్లో నిజంతో గోపీచంద్‌ని విలన్‌గా చూపించాడు తేజ. ఆ సినిమాతో గోపీచంద్ కు ఎంత పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఇప్పుడు మరోసారి గోపీచంద్ కు తేజ బ్రేక్ ఇస్తాడేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: