డిసెంబర్ రిలీజ్ కే ఇంట్రెస్ట్ చూపుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు పలు వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండాగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాను వచ్చే ఏడాది లవర్స్ డే ఫిబ్రవరి 14వ తేదీన రోజున రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే షూటింగ్ కూడా చివరిదశకు రావడం.. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో అంత దూరం వరకూ వెళ్లకుండా ముందుగానే ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్టుగా సమాచారం. మరి ఇక ఇదే డిసెంబర్లో సాయిధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో పాటు ఇంకా రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి చూద్దాం విజయ్ ఏం డిసైడ్ అవుతాడో.

కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇజబెల్లె నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ నాలుగు షేడ్స్ లో కనిపించనున్నాడట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =