తుది దశలో ‘డిస్కో రాజా’?

Disco Raja Movie About To Wrap Up Its Shooting Schedule,2019 Latest Telugu Movie News, Disco Raja Movie Updates, Ravi Teja Latest Flick Disco Raja, Ravi Teja Latest Flick Disco Raja Shooting Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema News

మాస్ మహారాజా రవితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ క‌థానాయికలుగా నటిస్తుండ‌గా… సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… ఇటీవ‌ల‌ ఐస్ ల్యాండ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్టు స‌మాచారం. ప్రస్తుతం… హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో చిత్రానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుందని వినికిడి.

యువ సంగీత సంచ‌ల‌నం ఎస్.ఎస్.థమన్ బాణీలు అందిస్తున్న ‘డిస్కో రాజా’… క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.