నిఖిల్ ‘కార్తికేయ’కు ఐదేళ్ళు

Nikhil Karthikeya Completes 5 Years,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema News,Karthikeya Completes 5 Years,Karthikeya Telugu Movie,5 Years for Karthikeya Movie

స‌స్పెన్స్‌కి కామెడీ తోడైతే ఆ ఫార్ములా సూప‌ర్ హిట్టే. ఈ కోవ‌కు చెందిన ఓ సినిమానే… `కార్తికేయ‌`. ప‌రిమిత బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌… బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. ‘స్వామి రా రా’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత నిఖిల్, స్వాతి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా కూడా అదే బాట ప‌ట్ట‌డం విశేషం. చందు మొండేటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ మూవీలో .. తనికెళ్ళ భరణి, రావురమేష్, ప్రవీణ్, తులసి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామజోగయ్య శాస్త్రి, వనమాలి, కృష్ణ చైతన్య గీత రచన చేయగా… శేఖర్ చంద్ర వీనుల విందైన బాణీలు అందించారు. వాటిలో “ఇంతలో ఎన్నెన్ని వింతలో”, “పున్నమి వెన్నెలకే”, “స‌రిపోవు” వంటి పాటలు ప్ర‌జాదరణ పొందాయి. 2014 అక్టోబర్ 24న విడుదలైన ‘కార్తికేయ’… నేటితో ఐదు వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.