‘పింక్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్..?

Pawan Kalyan To Act In Pink Movie Remake?,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Pink Movie Remake In Tollywood,Power Star Pawan Kalyan In Pink Movie Remake,Pawan Kalyan Latest News 2019

టాలీవుడ్ లో అభిమానులు కాకుండా భక్తులు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పొచు. కానీ తమ అభిమానులను కాస్త నిరాశ పరిచి సినిమాలకు గుడ్ బై చెప్పి మొత్తం రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ మధ్య పవన్ మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నట్టు వార్తలు రావడంతో.. తను ఇంకా సినిమాలు చేయనని అప్పట్లో క్లారిటీ ఇచ్చేసాడు. కానీ పవన్ చెప్పినా కూడా అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా మరో తాజా న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే… పవన్ కళ్యాణ్ మళ్ళీ వెండితెరపై రావడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. అది కూడా హిందీ రీమేక్ తో. 2016లో హిందీలో అమితాబ్ – తాప్సీ ప్రధాన పాత్రలను పోషించిన ‘పింక్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నాడు.

ఇక ఈ సినిమాను ‘బ్రోచేవారెవరురా’ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయనున్నాడట. ఇప్పటికే వివేక్ స్క్రిప్ట్ పనిలో పడ్డారట. తెలుగు ఆడియన్స్ కు తగ్గట్టుగా కథ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి త్వరలోనే పవన్ కళ్యాణ్ ను కలిసి స్టోరీ చెప్పనున్నాడట. త్రివిక్రమ్ డైలాగ్స్ అందించనున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.